శీర్షిక: *రాజ్యాంగ శిల్పి*
అవనిలో అవతరించిన విద్యా కుసుమం
అహపు అగ్రకులాల పాలిటి ఆశనిపాతం
రాజ్యాంగాన్ని రచించి ఘనతను సాధించిన
గొప్ప సాహాసి సహనశీలుడు డా. అంబేద్కర్!
తోటి స్నేహితులు హేళన చేసినా
గురువులు బయట కూర్చో బెట్టినా
దప్పికను తీర్చక అడ్డుపడినా
చెక్కు చెదరని మనో ధైర్యంతో
సాగిపోయే చదువులలో మేటిగా!
ధలితబ్రతుకులకు స్త్రీల స్థితిగతులకు చలించి
అల్పకులాలపై అగ్రకులాల ఆధిపత్యాన్ని భరించి
చీదరింపులను ఛీత్కారాల దుమ్ము దులుప
అవతరించే పుడమిన మన అంబేద్కర్!
ఉన్నత చదువుల కొరకు విదేశాలకేగీ
పలు డిగ్రీలు చదివి బారిస్టర్ చేపట్టి
గొప్ప భావ జాలంతో మేధావుల మనసుగెలిచి
భారత అతి పెద్ద రాజ్యాంగమును రచించి
రాజ్యాంగ శిల్పిగా జగతికెక్కే!
న్యాయ వాదిగా సంఘసంస్కర్తగా
ఆర్ధిక వేత్తగా రాజకీయ నాయకుడిగా
ప్రధమ భారత న్యాయ శాఖామంత్రిగా
భారత రత్న అవార్డు గ్రహీతగా
కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయే!
బడుగు జీవుల ఆరాధ్య దైవం
అజాత శత్రువు పరమ దేశ భక్తుడు
విద్యాధికుడు బహుభాషా కోవిదుడు
అతడే అతడే బాబాసాహెబ్ అంబేద్కర్
జయహో అంబేద్కర్ జయజయహో అంబేద్కర్!
No comments:
Post a Comment