Monday, April 7, 2025

నింగి నేల మన జీవన గీతం

అంశం: నింగి నేల మన జీవన గీతం


శీర్షిక: నింగి ఎత్తు ఎదిగినా...

*భార్యా భర్త లేకుండా కుటుంబం లేదు*
*నేల నింగి లేకుండా విశ్వం లేదు*
*తాళాలు కదుపకుండా శబ్ధం రాదు*
*గొంతు పెకలకుండా జీవిత గానం లేదు*!

నింగికి నేలకు ఉంది అవినాభావ సంబంధం
ప్రకృతిని పర్యావరణాన్ని పంచభూతాలను
పరిరక్షించు కుంటేనే జీవకోటికి మనుగడ
ప్రకృతికి తూట్లు పొడిస్తే మిగిలేవి దుఃఖ గీతాలే!

నింగి అంత ఎత్తులో ఆశయాలు లక్ష్యాలు
సహనం సర్దుబాటు తత్వం ఉన్నను
నేల కన్న దిగువలో అహం కామ క్రోధ లోభ
మోహ మద మాత్సర్యాలు ఉన్నను
మన జీవితం మధుర గీతమే కదా!

గగన వీదుల్లో మనిషి సత్వగుణాలు ఉండి
నేల మాళిగలలో రజో తమోగుణములున్న
ఆ మనిషి జీవితం నిత్యం కళకళ లాడే
అందాల హరివిల్లే మధుర గానం చేయును కదా!

నింగి నేల నడుమనే మనిషి మనుగడ
ఎన్ని విద్యలు నేర్చి ఎంత సంపాదించినా
నింగి ఎత్తు ఎదిగినా ఆకాశంలో విహరించినా
నేలకు చేరాల్సిందే మట్టిలో కలువాల్సిందే!

No comments: