అంశం: సత్యమా నీ వెక్కడ ?
శీర్శిక: *యథా రాజా తథాప్రజా*
*తిమిరంలో కాంతి ఎక్కడ* అన్నట్లు
సత్యమా నీ వెక్కడా?
అనే సంశయం కలుగక మానదు
*నేడు సత్యం అనేది అందని ద్రాక్ష*
ఇక్కడ ఎవరినీ తప్పు పట్టనవసరం లేదు
లోకం తీరు అలానే ఉంది
చెప్పేటందుకే నీతులు నడిచేది అడ్డదారులు
*యథా రాజా తథా ప్రజా*
నాయకులు ఎలా నడుచుకుంటారో
ప్రజలు అలానే నడుచుకుంటారు
కలియుగం ఆదిలోనే ఉన్నాము
నాలుగు పాదాలతో అబద్ధాలు పాపాలు మోసాలే
సత్యాన్ని కాగడా పెట్టి వెతికితే నుండునేమో
తిమిరంలో మినుగురు పురుగుల్లా!
సత్యం ఎక్కడో లేదు నీలో నాలో
అందరిలోనూ ఉంది
కానీ సత్యం వేప రసంలా చేదుగానూ
కష్టంగా ఉంటుంది
అబద్దం చక్కెర పాకంలా తీయగానూ
సులభంగా ఉంటుంది
అందుకే కాబోలు బ్రతక నేర్చిన వారు
లౌక్యంతో జీవించే వారు సత్యాన్ని పలుకరు
అసత్యాలకు అధర్మాలకే మొగ్గు చూపుతున్నారు
ఎప్పటికైనా సత్య మార్గం ధర్మ మార్గమే
సరియైనది గొప్పది కీర్తి ప్రతిష్టలు తెచ్చేది
అందుకే సత్యహరిశ్చంద్రుడు నేటికీ
సత్యవంతుడిగా చరిత్రలో నిలిచి పోయాడు
శ్రీ రాముడు బుద్దుడు ధర్మ వంతులుగా
నేటికీ చరిత్రలో నిలిచి పోయారు
No comments:
Post a Comment