*రామదాసు కళా సేవా సంస్థ అధ్వర్యంలో నిర్వహించే జాతీయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా:*
శీర్షిక: *సాహిత్య కెరటం*
అది ఉవ్వెత్తున లేచిన ఒక సాహిత్య కెరటం
సమూహాలన్నింటిలో వినూతన సమూహం
వాసిలో రాశిలో ధీటు యనుట నగ్న సత్యం
అదియే రామదాసు కళా సేవా సంస్థ !
ఇంతింతై వటుడింతై నట్లు
ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరువది మూడవ
సంవత్సరంలో స్థాపించబడే
రెండువేల ఇరువది నాలుగులో
మొదటి వార్షికోత్సవం జరుపబడే
రెండు వేల ఇరువది ఐదు మార్చి పదమూడున
రెండవ వార్షికోత్సవం జరుపుతుండే!
వ్యవస్థాపకులు డా.దూత రామకోటేశ్వరరావు
ఒక గొప్ప విద్యావేత్త , సాహితీ వేత్త
సాహిత్యం పట్ల మక్కువ గల జ్ఞాన పిపాసి
అంతకు మించి గొప్ప కార్యదక్షత గలవారు!
ఎన్ని ఇబ్బందులు మరెన్నో ఆపదలొచ్చినా
సాహిత్యసౌరభాల ముందుకు తీసుకెళ్తున్న
నిత్య కృషీవలురు డా. దూత రామ గారు
సహచరులు వారి కార్య వర్గ సభ్యులు!
అతి తక్కువ కాలంలోనే సాహిత్యంలో
తెలుగు భాషను సంరక్షించాలనీ
ప్రజలలో చైతన్యం తీసుకుని రావాలని
సమాజంలో ఒక మార్పు తేవాలని
అందుకు సాహితీ కవులను కవయిత్రులను
ఆయుధాలుగా మలుచుకుని!
రామదాసు కళా సేవా సంస్థ ద్వారా
మరియు రామదూత సాహితీ క్షేత్రం
e వార పత్రిక ద్వారా
సాహితీ క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా
శ్రీమతి దూత రామలక్ష్మి గారు
ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు!
దూత రామ కోటేశ్వరరావు గారి కూతుర్లు
వారు పిల్లలు కాదు పిడుగులు
కావ్య కళ్యాణి కవి సమ్మేళనంలోవారి సేవలు
అచ్చెరువు గొలిపే విచ్చేసిన అతిథులకు
కవులకు కవయిత్రులకు
ఒక వైపు సాహిత్యాన్ని ప్రోత్సహించడం
మరోవైపుసాహిత్య కవుల ప్రోత్సహించడం
అద్భుతమైన ప్రశంసాపత్రాల అందించడం
తెలుగు సాహిత్య సేవలన్నియూ ఉచితమే!
మన రామదాసు కళా సేవా సంస్థ
మరియు రామదూత సాహితీ క్షేత్రం
కవులకు గొప్ప సదవకాశాన్ని కల్పిస్తున్నది
ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపుతుంది
వారిలో తెలుగు భాషా జ్ఞానం పెంచుతుంది
ప్రశంసా పత్రాలు మెమెంటోలు శాలువాలతో
బిరుదులతో నిరంతరం సత్కారాలన్నియూ
ఏ లాభాపేక్ష లేకుండా సాహితీ సేవ చేస్తున్న
వారి తెలుగు సాహితీ సేవలు అనర్ఘ్యం!
No comments:
Post a Comment