అంశం: భావ గీతాలు
శీర్షిక: *అందాల మన్మధా!*
పల్లవి:
ఆమె:
ఓ.... అందాల మన్మధా...
ఓ....ఆనందాల మన్మధా....
అపురూప సుందరా...
అతి లోక సుందరుడా...
నీవు ఇచ్చిన బహుమానం మనోహరం...
మన్మధా ..అది ఎంతో సుకుమారం .. "ఓ..."
చరణం:01
అతడు:
నాకు నచ్చిందిదీ.. , నీకు నచ్చిందీ..
అందమైన చీరలోన సుందరంగా ఉన్నావే
పిల్ల గాలి నిన్నొదిలి ఉండనంటున్నదే
ఆడుతూ పాడుతూ ఆకాశాన ఎగరవే
ఆమె:
ఓ.... సుందరమైన మన్మధా....
మహా సుందరమైన మన్మధా...
రంగు రంగుల చీరలో ....
లేత పచ్చని చీరలో...
ఇంద్ర ధనుస్సు లా
పులకించి పోతున్నా.... "ఓ...."
చరణం 02
అతడు:
అదిరిన నీ పెదవులలో...
ఒదిగి ఉన్న నీ చిరునవ్వు ...
కవ్విస్తున్నది నా తలపులో..
కదిలిస్తున్నదే నా మేనులో..
ఆమె:
ఓ... పున్నమి వెన్నెలలో ...
పుడమి చల్లదనంలో...
సుందర మన్మధా...
అతిలోక సుందరుడా..
పులకరించి పోతున్నా...
పుత్తడి బొమ్మ లా.... "ఓ...."
చరణం:03
అతడు:
మధురమైన నీ పలుకులు...
హృదయంలో నిండినవి...
అందమైన నీ సొగసులు ...
కనుల ముందే కనబడుచున్నవి...
ఆమె:
ఓ... నీ వెచ్చని కౌగిలిలో ...
ఒదిగి పోవాలనీ...
నా సొగసులన్ని నీ కోసం
ఆరబోయాలనీ.....
ఉసి గొలుపుతోంది నా హృదయం "ఓ..."
No comments:
Post a Comment