Wednesday, April 23, 2025

కనపడని కవ్వం


అంశం:*కనపడని కవ్వం*

శీర్షిక: *మనసుంటే మార్గం ఉంటుంది*


*చల్లను కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది*

*మెదడును మనసుతో వెతికితే జ్ఞానం వస్తుంది*

అందుకే అంటారు పెద్దలు 

*మనసుంటే మార్గం ఉంటుందని*


చల్లలో వెన్న కనపడనట్లే 

మెదడులో జ్ఞానం కనపడదు 

మనిషి మెదడు అనంతం 

మనిషి మనసు చంచలం!


మేధో మథనం జరుగాలంటే 

మనసు కుదురుగా ఉండాలి 

సాగర మధనం జరుగుతే అమృతం వచ్చినట్లే 

మేధో మధనం జరుగుతేనే జ్ఞానం లభిస్తుంది!


మనసు కుదురుగా ఉండాలంటే 

వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి 

ఈతి బాధలు దుఃఖాలు ఉండకూడదు 

ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి

ఏకాగ్రత,విషయ పరిజ్ఞానం సమయం ఉండాలి!


అప్పుడే మేధో మథనం జరిగి 

చక్కని ఫలితాలు పరిమళాలు పులుముకుని 

శోభాయమానంతో బయటకు వస్తాయి 

అవి వ్యక్తిగతంగానూ  సమాజానికి 

దేశానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి!

No comments: