Thursday, April 17, 2025

దాన ధర్మాలు

 శీర్షిక: *దాన ధర్మాలు*


భారత దేశ సంస్కృతి సాంప్రదాయ
దాన ధర్మాలలో *దానానిది* ఉన్నత స్థానం!

తపస్సు జపం ఇతర అనుష్ఠాలు అనేకం
చేయడం వలన వచ్చే ఫలితం కంటే 
ఎక్కువ పుణ్యం, అవసరమైన వారికి
ఒక్కదానం చేయడం వలన కలుగుతుంది!

చేసే దానం అన్న దానం భూదానం
గోదానం విద్యాదానం వస్త్ర దానం
డబ్బు దానం అవయవదానం కర సేవ
వస్తువు రూపేణా ఏదైనా కావచ్చు
అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా
ఎలాగైనా దానం చేయవచ్చు!

చేసే దానం ఎదుటి వారి అభివృద్ధికి తోడ్పడితే
ఎదుటి వారిలో మార్పు తీసుక రాగలుగుతే
దానం పొందిన వారు సంతోషంగా జీవిస్తే
దానకర్ణుల కనులనుండిరాలే ఆనందభాష్పాలు
ఆ ఆనందం ఆ తృప్తి  వెలకట్టలేనిది!

దానాలలో ఏది గొప్ప ఏది కాదు అనేదానికి
నిఘంటువులో అర్ధం దొరుకదు
ప్రేమతో ఇష్టంతో నిస్వార్థంగా మనస్పూర్తిగా
నిండు హృదయంతో చేసే  దానం సేవ
ఏదైనా అది గొప్పవే అవి మానవత్వానికి
అద్దం పడుతాయి!

No comments: