Thursday, April 10, 2025

శ్రీ శైల పుణ్య క్షేత్రం

అంశం: *శ్రీ శైల క్షేత్ర మహత్మ్యం*


శీర్షిక: *శ్రీశైల పుణ్యక్షేత్రం*

భ్రమరాంబ మల్లి కార్జునుల వైభవం
సకల వేదాలకు మూలాధారం
పవిత్రజ్యోతిర్లింగం, భ్రమరాంబక్తిపీఠం
ఒకే కొండపై వెలసిన పుణ్యక్షేత్రం!

వేదాలకుప్రాణాధారం శ్రీశైలపుణ్యక్షేత్రం
చతుర్వేదాలలో యజుర్వేదంలోని 
పంచాక్షరి రుద్ర నమక మంత్రం
ఓం నమఃశివాయ యెంతో ప్రాముఖ్యం!

కర్నూలు జిల్లా శ్రీశైలం కొండలలో
కృష్ణానది తీరాన , శ్రీ బ్రమరాంభ 
మళ్ళి కార్జునులు కొలువు తీరిన
క్రీస్తుశకం మూడవ శతాబ్దాన  వెలసిన
పుణ్యక్షేత్రం, శ్రీ శైలం!

అరుణాసురుడనే రాక్షసుడు
దేవతలను హింసించ , వారి గురువు
బృహస్పతి శరణు వేడగా నంతట
గురువు , అరుణా సురుని చెంత చేరి
గాయిత్రీ మంత్రమే పఠించ సాగే!

తన గాయత్రీ మంత్రం జపిస్తున్నాడని
అహంకారంతో , మంత్రాన్ని విడిచి పెట్ట
శక్తి స్వరూపిణి  భ్రమరాల రూపాన
అరణాసురుని అంతమొందించి
శ్రీశైలం లో భ్రమరాంబిక గా వెలిసే!

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం
భ్రమరాంబిక అమ్మవారి గర్భగుడి
మనోహరకృష్ణానదీతీరం,పాతాళగంగ
నాగప్రతిమలు , గుడులు గోపురాలు
మరెన్నో కనువిందుచేయు పుణ్యక్షేత్రం!

No comments: