అంశం: మేడే
శీర్షిక: *మేమంతా ఒకే కులం! భారత ప్రేమికులం!*
బ్లాక్ కాలర్ గుర్తులం
విసిరి పారేసిన విస్తారాకులం
స్వచ్ఛ భారత్ ముద్దు బిడ్డలం
ఆకాశహార్మ్యాలు నిర్మిస్తాం
ఏ పని చేయడానికైనా సిద్దం
చేసిన కూలీ అడుగలేని దౌర్భాగ్యులం
రెక్కడుతే గానీ డొక్కాడని మేమే శ్రామికులం!
కర్మాగారాలలో కండలు కరిగిస్తాం
బొగ్గు బావులలో చెమటను చిందిస్తాం
దేశానికి ఉత్పత్తిని అందిస్తాం
పనిగంటల నియమం లేని
కార్మిక చట్టాలు వర్తించని
కార్మికులం మేమే కార్మికులం!
దుక్కిని దున్ని విత్తనాలు చల్లి
పంటలను పండించే రైతులం
వర్షాలకెదురు చూసే చకోర పక్షులం
పంటలు పండించే అన్నదాతలం
ధరలను నిర్ణయించుకోలేని ధీనులం
కర్షకులం మేమే కర్షకులం!
కొండలు కోనలలో నివసిస్తూ
శత్రువులతో పోరాడుతూ
ప్రాణ త్యాగాలకు సిద్దపడుతూ
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ
ప్రజలను ఆత్మీయ బంధువులుగా
రక్షించే సైనికులం మేమే సైనికులం!
రవి కాంచని చోటును రవి గాంచునన్నట్లు
కష్ట జీవులకు పాలకులకు మధ్య వారధిగా
అవినీతి పరులకు స్వప్న సింహాల్లా
ప్రజలను చైతన్య పరిచే కరదీపికలుగా
కలగలిసిన కవికులం మేమే కవులం !
మేమంతా ఒకే కులం! భారత ప్రేమికులం!
No comments:
Post a Comment