Wednesday, April 16, 2025

వాడని వలపు వసంతం

అంశం: వాడని వలపు వసంతం 

శీర్షిక:  నిండు నూరేళ్ళు 


*నిండు నూరేళ్ళ వివాహ బంధం*

*వాడని వలపు వసంతం*

*విరాజిల్లాలి జగతిలో ఇంద్రధనుస్సులా*


సూర్య భానుడిలా తేజో వంతులై

నిండు పౌర్ణమి వెన్నెలలా చల్లని మనస్కులై

పచ్చని తరువులకు చిగురించిన లేలేత కొమ్మలై

పాల సముద్రం లాంటి నమ్మకాలతో 

పరిణతి చెందిన మనసులతో !


అంద చందాలు  బంధాలు అనుబంధాలు

రక్త సంబంధాలపై అవగాహనతో 

వివాహ బంధంపై జీవితంపై విశ్వాసంతో

భావాలు ఆలోచనలు మాలలో దారంగా!


కులం మతం ప్రాంతం భాషలపై 

పూర్తి స్పష్టతతో 

ఆర్ధిక స్వేచ్చా స్వాతంత్ర్యాలతో

సహనం సర్దుబాటు సుగుణాలతో 

ఆశలు కోరికల అదుపుతో!


మృదు మధుర స్వప్నాలతో 

మనువుతో పెనవేసుకున్న హృదయాలు 

సంపూర్ణ కాలం సుఖ సంతోషాలతో 

ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో 

ఆనందంగా తృప్తిగా గడిపిన జీవితం 

వాడని వలపు వసంతమే!

No comments: