Saturday, April 19, 2025

తత్త్వ గీతాలు

అంశం:తత్త్వ గీతాలు 

శీర్షిక: నాదీ నాదీ అని అంటావూ..

పల్లవి:

నాదీ నాదీ అని అంటావూ ....

నాదే అంతా అనీ.. భ్రమ పడుతావూ ...

నాదీ నీదీ ఏదీ లేదు నరుడా ...

నాలుగు రోజులు ఇచట ....

బ్రతక వచ్చాము మనమూ గురుడా...   "నాదీ"


చరణం:01

ఎంత సంపాదించినా...

ఎంత కూడ బెట్టినా...

వెంటేమీ తీసుకుని పోలేవు నరుడా 

ఏ సంపదైననూ ఇక్కడే 

విడిచి పోవాలీ గురుడా             "నాదీ"


చరణం:02

బంధు మిత్రులంటావూ....

భార్యా పిల్లలని భ్రమ పడుతావూ....

శ్వాస ఆగిన రోజు నరుడా...

భార్యా పిల్లలు ఎవరూ...

తాకను గూడా రారు గురుడా.....     "నాదీ"


చరణం:03

ఉన్న దాంతో తృప్తి పడుతూ....

కొంత నైనా దానం చేస్తూ....

నలుగురితోనైన కలిసుండు నరుడా...

కాటికి పోయే రోజు వారే...

గుర్తుపెట్టుకుని మోస్తారు గురుడా......       "నాదీ"


No comments: