Tuesday, April 22, 2025

వలపు చెర/పద్మ వ్యూహం

అంశం: వలపు చెర


శీర్షిక: *పద్మవ్యూహం*

*విశ్వద  "వలపు చెర" లో పడిన వేమన*
*కోల్పోయే సర్వస్వం చివరికి*
*అవమానాలతో అడవిలో తేలే యోగిలా*!

*వలపు చెర* ఒక ఊబి
ఒక సారి  దిగారా రారు ఇక బయటకి
*వలపు చెర*  ఒక చెరశాల
ఒక సారి వెళ్ళారా తిరిగి రారు క్షేమంగా!

వలపు అనేది పాయసం వంటి విషం
త్రాగు తుంటే ఇంకా త్రాగాలనిపించుతుంది
శరీరమంతా పాకి నీలి రంగులో మారాక
హస్తి పంజరాన్ని బయట పడేస్తుంది!

*వలపు చెర* అనేది ఏడు వలయాలు కలిగిన
ద్రోణాచార్య పన్నిన పద్మవ్యూహం వంటిది
అభిమన్యుడు పద్మ వ్యూహం లోకి చేరాడు
కానీ రావడం  కష్టమై వీరోచితంగా పోరాడి
పద్మ వ్యూహంలోనే మరణిస్తాడు!

*వలపు చెర* ఆన్లైన్ బెట్టింగ్ లాంటిది
అక్కడ మాయమాటలు చెబుతూ
చిన్న చిన్న మొత్తాల గెలుపు ఎరవేసినట్లే
ఇక్కడ వంపు సొంపులు ఒలక బోస్తూ
మయూరిలా పురి విప్పుతూ సిరులు లాగుతూ
జీవచ్ఛవంలా మార్చి వేస్తారు!


ఓ యువతా మేలుకో!
రెండు చేతులు కలుస్తేనే చప్పట్లు
ఇద్దరి మనసులు కలిస్తేనే అచ్చట్లు ముచ్చట్లు
అవకాశాలున్నాయని అగాధంలోకి దూకవద్దు
దీర్ఘ అనారోగ్యాల బారిన పడవద్దు
ఇంద్రుడిలా అవమానాల పాలు కావద్దు
బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు!

No comments: