Thursday, April 24, 2025

నచ్చిన కవి శ్రీ శ్రీ

అంశం: మీకు నచ్చిన కవి


శీర్షిక: నాకు నచ్చిన కవి శ్రీ శ్రీ

కష్టాలను తనకు యిష్టముగా మార్చు
విప్లవ సాహిత్య విరసము కవి
శ్రమజీవుల యెడ సమరము జేసిన
సాహాసవంతుడు సంగ్రామమున!

గ్రాంధిక భాషను గడిచివ భాషని
ఛందస్సును కూడా చక్కదిద్ద
సరిపోదు ననుచు నాడె సడలించి
గురజాడ బాటలో నడిచిన బాటసారి!

అగ్గి పుల్లయు గాని నటు కుక్కపిల్లయు
సబ్బు బిళ్లయు గాని అదియె గొప్ప
కవిత రాయుటకును కథలు రాయుటకును
పనికి వచ్చు ననియు రణము జేసే!

No comments: