Monday, April 7, 2025

శ్రీ రామ చరితం/శిశిరాలు

అంశం: ప్రక్రియ: శిశిరాలు 

శీర్షిక: శ్రీ రామ చరితం

అయ్యో!
*కల్ల బొల్లి* మాటలు చెప్పి మందర
*గుస గుస* చెప్పే కైకేయికి దశరధుని కోరమని
*గబ గబ* రాముడిని అడవులకు పంపమని
భరతుడికి పట్టాభిషేకం చేయమని చెప్పే!

ఏమీ!
*చేయు నేమి* లేక దుఃఖితుడైన దశరధుడు
*జల జలా* కన్నీరు కార్చుతూ
*మనసు ధిటువు* చేసుకుని మూగ స్వరంతో
అడవులకేగమని చెప్పె రాముడికి!

హతవిధీ!
*మారు మాట* చెప్పకుండా రఘుకుల సోముడు
*చక చకా* బయలుదేరే సీత లక్ష్మణుడు వెంటరాగ
*అష్ట కష్ట* ములు పడిరి కానలందు
సీతనపహరించే మాయ రావణుడు పర్ణశాలలో!

ఓహో!
*అతి బల* శాలుడైన వాలిని హతమార్చి
*కలిసి మెలిసి* యున్న సుగ్రీవునికి రాజ్యమప్పగించె
*దుష్ట శక్తి* యైన రావణుడిని సంహరించి
పతివ్రత యైన సీతను తోడ్కొని అయోధ్యకేగే రాముడు

ఆహా!
కళ కళ లాడెను అయోధ్యానగరం 
తళతళ మెరిసెను పట్టణమంతా కాంతులతో 
జయజయ ధ్వానాలు చేసిరి పురజనులంతా
శ్రీ రాముడు అయోధ్యను పాలించే ధర్మరీతిన!

No comments: