Tuesday, April 8, 2025

వృద్ధాప్య దశలో కష్టాలు బాధలుP

అంశం:ఒంటరి తనం


శీర్షిక: వృద్ధాప్య దశలో కష్టాలు బాధలు 

మనిషి ఎదుగు తుంటే ఒదిగి ఉండాలి
వయసు పెరుగుతుంటే అనిగి ఉండాలి
వృద్ధాప్యాన్ని వార్ధక్యాన్ని ముసలి తనాన్ని 
ఎవరూ తప్పించు కోలేరు!

బావిలో నీరు ఎండినప్పుడు పెంకులు తేలినట్లు 
వృద్ధాప్య దశలో  రోగ నిరోధక శక్తి తగ్గి 
అప్పటి వరకు దాగి ఉన్న రోగాలన్నీ 
ఒక్కొక్కటిగా బయటపడటం సహజం 
అప్పటికే బిపి షుగర్ క్యాన్సర్ క్రానికల్ గా ఉంటే
ఆ బాధ ఇక చెప్ప నలవి కాదు!

ఆ వయసులో చేతిలో అధికారం ఉండదు
ఆదాయ మార్గాలు మూసుకుంటాయి
డబ్బూ  హోదా దర్పం ఉండదు 
ఉన్నా  వారు బ్యాంకుకూ వెళ్ళలేరు 
కొందరు సంపద ఉన్నప్పటికీ అనుభవించలేరు
చెబుతే వినే వారు ఎవరూ ఉండరు
గౌరవించే వారు దరిదాపున కనబడరు!

వృద్ధాప్య దశలో పూర్వవైభవాలు మరిచి 
పసిపిల్లాడి అవతారం ఎత్తాలి 
కోపాలు తాపాలు అహం ఈర్ష్య అసూయ 
స్వార్ధం  నియంతృత్వం విడనాాలి
అడుగ కుండా సలహాలు ఎవరికీ ఇవ్వకూడదు
చాడీలు విమర్శలు చేయకూడదు!

అందరితో కలుపు గోలుగా మెలగాలి
ఏదో ఒక మంచి వ్యాపకంలో సేద తీరాలి
అవకాశముంటే దాన ధర్మాలు చేయవచ్చు
చేతనైతే సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చు

షేక్స్పియర్ అన్నట్లు 
*ఒంటరి తనాన్ని జయించడానికి*
*ఆశలు కోరికలు వదిలేయ్ ప్రశాంతత పెంచు*
*విజయం నీదే*

No comments: