Monday, April 7, 2025

నా కలల రాణి

*అంశం* *పదాల కవిత*

*కలల వారథి*
*చూపుల నావ*
*వలపు వెన్నెల*
*వరద గోదారి*

శీర్షిక: నా కలల రాణి

గల గల పారే నిండు *వరద గోదారి* లా
జల జల జారే జలపాతంలా
పచ్చని మైదానంలో పురి విప్పిన నెమలిలా
హొయలు ఒలికిస్తున్నావే నా వాణి!

నీవు విసిరే ఆ *వలపు వెన్నెల* కు
జాబిలి సిగ్గు పడుతున్నట్లుగా
మనసు పూదోటలో విహరిస్తున్నట్టుగా
మేను ఆకాశంలో తేలి పోతున్నట్లుగా ఉందే!

లేలేత కిరణాల వంటి *నీ చూపుల నావ* తో
నాకు లంగరు వేసి కదలకుండ చేస్తివా
చంద్ర బింబం వంటి నీ మోముతో
ముసి ముసి నవ్వులతో మెరిసి పోతుంటివే!

ఎంతో కాలంగా నేను కట్టుకున్న *కలల వారధి*
నేను కంటున్న కలల స్వప్నం
నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందా
ఆహా! ఇది కలా నిజమా నా కలల రాణి!



No comments: