Monday, April 21, 2025

బంగారు బాటలు

అంశం: కలల బాట


శీర్షిక: *బంగారు బాటలు*

ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆశయాలు
విర బూసిన పూదోట వలె సంతానముండాలనీ
పరిమళాలు వెదజల్లు నట్లు బిడ్డలు ప్రకాశించాలనీ
ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో కలలు తల్లిదండ్రులకు!

ఆ సంతోషాలకు ప్రతీకగా శిశువుకు జన్మ నిచ్చి
చక్కగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి
వెన్నెలలో చంద్రుడికిలా ఎల్లవేళలా ప్రేమతో
కంటికి రెప్పలా కాపాడుతూ బంగారు బాటలు వేయు!

ఆ చల్లని వర్షపు ఆకాశంలో ఇంద్ర ధనుస్సులా
విరబూసిన పుష్పాలపై సీతాకోక చిలుకలులా
బిడ్డలు ప్రయోజకులవుతుంటే ఉప్పొంగిపోతూ
నవనవోన్మేషంగా మెరిసి పోవు ఆ హృదయాలు
వెలుగొందు ఆ కుటుంబాలు ఆచంద్రతారార్కం!

No comments: