అంశం: భక్తి గేయాలు
శీర్షిక: శ్రీ రామా.... కోదండ రామా...!
పల్లవి:
అతడు:
రామా... శ్రీ రామా
రామా... రఘుకల సోమా..
శ్రీ రామా... కోదండ రామా...
రామా.... అయోధ్య రామా...
రామా... శ్రీ సీతారామా...
ఏమయ్యా నీ లీలలు.. ...
జగములు పిక్కటిల్లునటుల....
ఏ ఇంటి లోనూ ఏ గుడిలోనూ
నీ రామ నామ జపములే... "రామా"
చరణం:01
అతడు:
ఆపదమొక్కుల వాడివట....
అందాల రాముడి వట.....
దశరధుని కుమరుడివట..
సీతమ్మ తల్లి నాధుడివట..
ఓకే మాట ఒకే బాణం ఒకే పత్నియట...
పితృవాక్య పాలకుడివట...
ధర్మ పాలకుడవు నీవే నట...
ఆంజనేయుడికి ఆదర్శమూర్తివట "రామా"
చరణం:02
అతడు:
ఎవరింటా నీవే నటా
నిత్యం నిన్నే కొలిచెదరటా..
రామ నామము జపించిన చాలట..
సకలు పాపములు బాయునట...
పిలిచిన పలికెదవట రామా..
కోరిన కోర్కెలు తీర్చెదవట...
రామా... శ్రీ రామా... పరంధామా... "రామా"
చరణం:03
అతడు:
రామా..నీవే నయా...
శ్రీ రామా నీవే నయా మా పాలిట దైవం..
నిత్యం నిన్నే కొలుతుమయ్యా ...
అనునిత్యం నిన్నే సేవింతుమయ్యా....
మా ఇలవేల్పువు నీవే నయ్యా....
మిమువీడము మేమెప్పటికయ్యా....
మము దీవించు నెప్పటికయ్యా..... "రామా"
No comments:
Post a Comment