Monday, April 7, 2025

మట్టి గణపతినే పూజిద్దాంP

అంశం: *మట్టి గణపతికి జై*

శీర్షిక: *మట్టి గణపతినే పూజిద్దాం*

శుద్ధ చవితి రోజున పుట్టిన
'"మట్టి గణపతి" నే పూజిద్దాం
గట్టిగ గణనాధుడిని సేవిద్దాం
ఉట్టిగ డబ్బు వృధా చేయకుండా
మట్టిలో కరిగే మట్టి వినాయకుడునే
కృత్రిమ రసాయనాలు లేని స్వామినే కొలుద్దాం
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవాళిపురోగతి 
కాదు కూడదని పట్టించుకోకుంటే అధోగతి 
ప్రతి ఒక్కరికీ కాపాడాలని ఉండాలి మతి 
లేదంటే విషమించుతుంది జీవుల పరిస్థితి

కృత్రిమ రసాయనాలు కృత్రిమ రంగులు
ఇనుప తీగలతో విషపూరితాలతో చేసిన
బొజ్జ వినాయకుల నిమజ్జనంతో
చెరువులు నదులు విషపూరితమై                    చేపలు జీవరాశులు నశించి పోతుంటే

పుణ్యమేల వచ్చు భక్తులకు?
స్వామి అనుగ్రహం ఏల కలుగు జనులకు?

ఓ భక్త జనులారా!
*ప్రతి ఒక్కరం మట్టి గణపతులనే పూజిద్దాం*
భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం
పర్యావరణాన్ని రక్షించుకుందాం!

No comments: