*నేటి అంశం*కవిత పూరించండి*
శీర్షిక: *కలల పంట*
*కలల దారుల్లోను ఎన్నో మలుపు ముళ్ళు*
*కన్నీటి వర్షంలో తడుస్తూ*
*వగచే హృదయాలు*
*ఆశల భవిత కోసం ఎదురు చూస్తూ*
*అందాల జగతి లో అక్షరాల*నిధులే పెన్నిధులై*
*తోడుగా ఉంటూ స్వాంతన నిస్తుంటే*
*శిశిరంలో తరువుల ఆకులు రాలి వసంతంలో చిగురించినట్లు*
*ఏవో కొత్త ఆశలు మదిలో మొలకెత్తు తున్నాయి*
*నా కలలు కల్లలు కావనీ అందాల హరివిల్లు అవుతుందని*
*మేఘ సందేశం వినిపిస్తుంది*
*నా రఘు వీరుడు భానుడు సుందర మనోహర రూపంతో*
*నా కలల పంటను పండించ*
*సప్త దవళ అశ్వా రూడుడై తెల్లని మబ్బులను చీల్చుకుని*
*వడివడిగా వస్తున్నట్టు నన్ను ప్రేమతో తోడ్కొని పోనున్నట్లు*
*ఇంత కంటే ఏమి కావాలి చకోర పక్షి లాంటి ఈ ప్రేయసికి*
No comments:
Post a Comment