Monday, April 14, 2025

సందెట్లో సడేమియా

ఎవరు వ్రాశారో కానీ నేటి తెలుగు సాహిత్య

వ్యాపార వ్యవస్థకు అద్దం పడుతుంది. 

నాకు నచ్చింది:

శీర్షిక: *సందెట్లో సడేమియా!*


వర్షం పడుతున్నప్పుడు
చేపలు వరదకు ఎదురెక్కినట్లుగా
కొత్తగా కవులు రచయితలు పెరిగి
వారు ప్రశంసా పత్రాలకు
పురస్కారాలకు బిరుదులకు
అవార్డులకు ఎగబడే సరికి
సందెట్లో సడేమియా అన్నట్లుగా
కవుల బలహీనతలను ఆసరాగా చేసుకుని
ప్రశంసా పత్రాలకు  పురస్కారాలకు
బిరుదులకు తేడా తెలియని మేధావులు
అన్ని పేర్లను ఒకే పత్రంలో ముద్రించే ఘనులు 
కొందరు సాహిత్య సంస్థలను నడిపిస్తూ
దేనికీ ఉపయోగ పడని పత్రాలు 
విలువ లేని అరపేజీ రంగుల కాగితమైన
పురస్కారానికో మూడు వేలు
బిరుదుకో ఐదు వేలు
అవార్డుకో పది వేలు
డాక్టరేట్ కో ఇరువది వేలు అంటూ
ప్రకటనలు గుప్పిస్తున్నారు
నేడు తెలుగు సాహిత్యం
ఒక వ్యాపారంలా మారింది
కొన్ని రోజులు కవితలు వ్రాయించడం
వారి వద్దే పుస్తకాలు ప్రింటింగ్
చేయించుకోవలని సలహాలివ్వడం
వాటికి రేట్లు ప్రకటించడం
మీరు చెల్లించే ప్రతి రూపాయి సరస్వతి మాతకు
చెందుతుందని దేవతల పేర్లు చెప్పి
సెంటిమెంట్ తో  కవుల నుండి
డబ్బు వసూలు చేయడం హేయం!

పరస్పర సహకారం ప్రింటింగ్ ఖర్చులకని
ముందే చెబుతే ఇష్టం ఉన్న కవులు
ఇస్తారు ఇష్టం లేని వారు ఇవ్వరు
అది సమర్ధనీయం సమంజసం 

కవుల పాండిత్యాన్ని మెచ్చి వారిని
అభివృద్ధి చేయాలని కొందరు కవులు దాతలు
విరాళంగా ఇస్తారు, అందులోనూ తప్పు లేదు

కానీ కవుల బలహీనతలను ఆసరాగా
చేసుకుని సెంటిమెంట్ తో
నీతులు పలికుతూ సమూహాలు నడిపిస్తూ 
మేమూ కవులమని చెప్పుకునే
కొందరు సాహిత్య వ్యవస్థాపకులు
వారి సమూహాలలో చేర్చుకుని
తెలుగు సాహిత్య కవితలు పద్యాలు
లఘు ప్రక్రియలు కథలు వ్యాసాలు వ్రాయించి
ఏదో రకంగా డబ్బు వసూలు చేయడం
తెలుగు సాహిత్యానికి శ్రేయస్కరం కాదు!

వారి గొప్పల కొరకు ఎదుగుదల కొరకు
కవుల నుండి డబ్బు వసూలు చేసే
కొందరి వలన తెలుగు సాహిత్య మనుగడ
ప్రశ్నార్థకంగా మారబోతోంది!

ఇలాంటి వాటిని విజ్ఞులు నిలువరించక పోతే
సమాజ రుగ్మతలపై, ప్రభుత్వ విధానాలపై
ప్రశ్నించే కలాలు ఆగిపోవచ్చు
ప్రజలలో చైతన్యం ప్రశ్నార్థకం కావచ్చు!

ఏ ప్రశంసా పత్రమైనా పురస్కారమైనా
బిరుదైనా అవార్డైనా డాక్టరేట్ అయినా
ప్రతిభతో రావాలి గానీ డబ్బుతో కాదు!

కవులు కూడా ఆలోచించాల్సిన
అవసరం ఎంతైనా ఉంది!

   

No comments: