అంశం: ప్రయాగ
శీర్షిక: *ఎందుకో ఆ అలక!*
ఓ నా కలల రాణి మిలమిల మెరిసే పూబోణి...
మధుర మందార మనోహర సుందర స్వప్నమా...
హొయల సోయగాలతో నా యెదమీటిన రాణి!...
రస రమ్య వీణాపాణి ఎందుకో నీకు ఆ అలక...
ఓ నా పంచ వెన్నెల బంగారు రామ చిలుక...
ఇకనైనా విడమరిచి చెప్పవే నాకు ఆ మలక!...
తిమిరంలో వెన్నెల జాబిలి లాంటి నీ మోము....
మోము చెక్కిలిపై సుందరమైన నల్లని దిష్టి చుక్క!..
కలువ రేకుల వంటి నీ కమనీయ కనులు....
హంస రెక్కలవంటి రెపరెప కొట్టే కనురెప్పలు...
తామర తూడుల వంటి సన సన్నని నడుము...
ఓ నా సీతాకోక చిలక ఎందుకో ఆ అలక....
మలక విప్పవే మెలిక తీయవే ఓ వయ్యారీ....
మహా రాణీ నీది శుభం *కర కర* ము....
నీ మోముపై అందాల సుం *దర దర* హాసము...
నాపై నీ దరహాసా *క్షరం క్షరం* కాకూడదని కోరుకుంటున్నా...
ఓ నా కలల రాణి మిలమిల మెరిసే పూబోణీ....
ఓ నా కలల రాణి మిలమిల మెరిసే పూబోణీ....
No comments:
Post a Comment