Friday, April 18, 2025

మంచితనం బంగారం లాంటిది

అంశం: *బంగారం*

శీర్శిక: *మంచితనం బంగారం లాంటిది*

*బంగారాన్ని నీటిలో వేసినా*
*బురదలో వేసినా*
*అది తళతళా మెరుస్తుంది*
దాని వన్నె ఎప్పటికీ తగ్గదు!

అలానే మంచి తనం ఇక్కడ నైనా
ఎక్కడ నైనా ఏ దేశమేగినా ఎప్పటికైనా
చెక్కు చెదరకుండా దగదగా మెరుస్తుంది
విలువ తగ్గదు!

సాధారణంగా  "ఏది మంచితనం
ఏది చెడ్డతనం"  అనేది కాలాన్ని బట్టి
ఆ నాటి పాలకులనుబట్టి మారుతుండు!

భారతదేశం భరతుడు ఏలిన రాజ్యం
రాముడు ధర్మ మార్గంలో పాలించిన రాజ్యం
గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు
వేదాలుపురాణాలుఇతిహాసాలకుపుట్టినిల్లు!

రాముడి మార్గం కృష్ణుడి తత్వమే 
భారతీయులకు అది శిరోధార్యం
ప్రతి పచ్చని పంటలోనూ పిచ్చి మొక్కలు 
పెరుగడం సహజం కలుపు తీస్తే పారిపోవు
నీతి నిజాయితీ సత్యం ధర్మం సత్ప్రవర్తన
బంగారం లాంటివే మన విలువలనుపెంచే
గొప్ప అస్త్రశస్త్రాలు!

మంచి తనానికి ఎప్పుడూ విలువ ఉండు
మంచి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉండు
మంచి మనసు నిండుకుండలా ఉండు
*మంచి తనం బంగారం లాంటిది* అది ఎప్పటికీ శాశ్వతం!

No comments: