Saturday, April 19, 2025

ఆడ పిల్లలకు తండ్రి ఆదర్శం

అంశం:అలంకార కవిత 

(అంత్యాను ప్రాస అలంకారాలు)


శీర్షిక: ఆడ పిల్లలకు తండ్రి ఆదర్శం 


పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులు 

రెండవ గురువులు బోధించే ఉపాధ్యాయులు

మూడవ గురువులు నమ్మిన ఇష్ట దైవాలు 

నాల్గవ గురువులు సమాజంలోని వ్యక్తులు!


మగపిల్లలకు తల్లి ఆదర్శం అంటారు 

ఆడ పిల్లలకు తండ్రి ఆదర్శం అంటారు 

కొందరు పిల్లలకు అత్త ఆదర్శం అంటారు 

మరికొందరు పిల్లలకు తాత ఆదర్శం అంటారు!


ఆదర్శంగా ఉన్నవారిని పిల్లలు ఇష్టపడుతారు

అలాంటి వారిని పూర్తిగా నమ్ముతారు

వారు ఏది చెప్పినా పిల్లలు అదే తప్పకచేస్తారు 

ఏది చేయకూడదు అంటే దానిని చేయరు!


తల్లిదండ్రులు చెడు చేయమంటే చెడేచేస్తారు 

నిజం మాట్లాడమంటే నిజమేమాట్లాడుతారు

అబద్దమాడమంటే అబద్దమేమాట్లాడుతారు 

అదే సరియైనది కావచ్చని  అనుకుంటారు!


అమ్మా నాన్నలు పిల్లలకు మంచిని నేర్పాలి 

గురువులు విద్యార్థులకు నీతిని బోధించాలి

అబద్దాలు ఆడకూడదని పిల్లలకు చెప్పాలి 

దొంగ తనం చేయడం నేరం ఆని చెప్పాలి

మోసాలు చేయడం పాపం అని చెప్పాలి 

చాడీలు విమర్శలు విలువతగ్గిస్తాయని నేర్పాలి!

No comments: