Saturday, April 26, 2025

చిత్ర కవిత / నీటి కొరత

అంశం: చిత్ర కవిత (నీటి కొరత)

శీర్షిక: *త్రాగు నీరు ఒక శాతం మాత్రమే*


*చుట్టూరా వారే, కానీ కోడి మాయమైనట్లు*

*చుట్టూరా సముద్రాలు నదులే కానీ మనిషి*

*నీటి కొరకు నిత్యం ఇక్కట్లపాలవుతుంటాడు*

*ఇక రాష్ట్రాలు దేశాలైతే యుద్దాలే చేస్తాయి*

*జల ఒప్పందాలే చేసుకుంటాయి*


ప్రపంచంలో మూడు వంతులు నీరైతే 

ఒక వింతే భూమి, అయినా నీటికి కటకటే 

అందుకు కారణాలు అనేకం చెప్పుకోవచ్చు! 


అందులో ముఖ్యమైనది 

ప్రజలకు ఉపయోగపడే త్రాగునీరు 

ఒక శాతం మాత్రమే

మిగిలిన నీరంతా ఉప్పుతో మంచుతో 

మరియు కలషిత నీరు ఉపయోగం లేనిది 

మూడవ కారణం నీరు జీవ కోటికి 

ప్రాణాధారం కావడం! 


భూమిలో ఇంకి పోవడం 

ఎండకు ఆవిరై పోవడం 

వర్షాలు సమృద్ధిగా లేక పోవడం 

పంటలకు పశుపక్ష్యాదులకు తరువులకు 

నీటిని అధికంగా ఉపయోగించడం! 


ఇలా అనేక కారణాల వలన 

నీటి ఎద్దడి ఏర్పడి నప్పుడు 

ప్రభుత్వాలు స్థానిక సంస్థలు 

ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తాయి!


నీటి సమస్యలను అర్ధం చేసుకుని 

కొరతగాఉన్నవాటిని పొదుపుగావాడుకోవాలి 

తోటి ప్రజల దాహార్తిని అర్ధం చేసుకుని 

అందరికీ సమానంగా వచ్చేటట్లు 

క్రమశిక్షణ పాటించి నీటిని పట్టుకోవాలి!


అప్పుడే నీరు వృధా కాకుండా ఉంటుంది 

ఏ గొడవలు కొట్లాటలు ఉండవు 

అందరి దాహార్తిని తీర్చుకోవచ్చు 

సర్వే జనా సుఖినోభవంతు!

No comments: