Tuesday, April 8, 2025

చతురస్ర గతి గజల్స్

అంశం: చతురస్ర గతి గజల్స్ (444444)24


వేకువ జామున లేచి చదివితే ఎంత ఇష్టమో
చదివిన చదువులు మదిన మెదిలితే ఎంత ఇష్టమో!

గులాబి తోటకు కాపరి నయినా ఎంత బాగుండు
చీటికి మాటికి కలియ తిరిగితే ఎంత ఇష్టమో!

నింగిన సింగిడి సప్త వర్ణాలు ఎంత అందమో
నేలన చల్లని  గాలి వీచితే ఎంత ఇష్టమో!

పచ్చిక బయళ్ళు తోటలు నెమళ్ళ వన విహారాలు
నెమళ్ళు తోటన పరుగులు పెడితే ఎంత ఇష్టమో!

రైతుకు వానలు పడితే ఎంతయో తృప్తి కృష్ణా!
రైతులు జనులకు కడుపు నింపితే ఎంత ఇష్టమో!

No comments: