Tuesday, April 22, 2025

నేనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నయితే

అంశం: నా ఊహా

శీర్షిక: నేనే కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రినయితే

భారత దేశం నా మాతృభూమి
నను కని పెంచిన పుణ్య భూమి
నిరుపేదలు అధికంగా నివసించు దేశం
విలవిల లాడుతున్నారు ఏ రోగాలు వచ్చినా!

ఉచితంగా చదివింప బడిన వైద్య విద్యార్థులు
ఉచితంగా చదివింపబడిన మేధావులు
కాసులకు కక్కుర్తి పడి కార్పోరేట్ హాస్పిటల్స్
నడుపుతూ పేదల పీడించి పిప్పి చేస్తున్నారు!

ఆరోగ్య ఇన్స్యూరెన్స్ లు అంటూ
ఏజెంట్లతో ప్రచారం చేయిస్తూ
అవసరం ఉన్నా లేకపోయినా
పేద మధ్యతరగతి ప్రజలకు అంటగడుతూ!

నట్టేట ముంచేస్తున్నారు ఇన్స్యూరెన్స్ కంపెనీలు
అందమైన హంగులతో కార్పోరేట్ హాస్పిటల్స్
జత కలిసిన నాయకులు అమాయక రోగులను
అధిక బిల్లులువేసి అప్పుల పాలు చేస్తున్నారు!

నా ఊహా నేనే ఆరోగ్య శాఖా మంత్రినవుతే
నివారణ కంటే నిరోధం ముఖ్యమని
ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తాను
మందులు లేకుండా జీవింప చేస్తాను

ఇన్స్యూరెన్స్ కంపెనీలను కార్పోరేట్ హాస్పిటల్స్
రద్దు చేస్తాను గాంధీ హాస్పిటల్స్ పునరుద్దరిస్తాను
జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ 
ప్లాస్టిక్ కవర్లు  ప్యాకింగ్ లను ప్లాస్టిక్ కప్పులను 
బ్యాన్ చేస్తాను కల్తీ ఆహారాన్ని నియంత్రిస్తాను

ఇంట్లోని దినుసులను మందులు గానూ
పెరటి మొక్కలను ఔషధాలుగా వాడాలనీ
ఇతర ఉచిత ఔషదాలను సూచిస్తాను
అందరు పాటించేలా ప్రోత్సహిస్తాను!

బ్రహ్మ ముహూర్తంలో లేవడం సూర్య నమస్కారం
ఉదయం సాయంత్రం ఒక గంట నడవడం
నిత్య అగ్ని హోత్రం ప్రాణాయామం ధ్యానం
ఉపవాసం నవ్వు మరియు హాస్యం పండించడం!

గాఢ నిద్ర అందరితో కలిసిమెలిసి మెలగడం
సంతోషంగా ఉండటం మనస్సులో సానుకూలత
ఆధ్యాత్మిక జీవనం ఇతరుల కొరకు ప్రార్థించడం
పరోపకారం వలన తృప్తి లభిస్తుంది!

అమ్మా నాన్నలకు సేవలు చేయడం
కొన్నిసార్లు నిశ్శబ్దం ప్రేమ ఇతరులకు పంచడం
ఉన్నంతలో తృప్తి చెందడం
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై  శ్రద్ద వహించడం!

No comments: