శీర్షిక: *యుద్దోన్మాదం*
ఏమిటీ ధారుణం
ఎందుకీ మారణ హోమం
ఉనికి కోసమా ఉన్నతి కోసమా
అగ్ర దేశాల స్వేచ్ఛ అంటే ఇదేనా
ప్రపంచ దేశాలకిచ్చే సందేశమిదేనా!
ఎడతెరుపని బాంబుల మోత
తోటి సైనికులనీ చూడకుండా ఊచ కోత
మానవ గృహాల , భవనాల కూల్చివేత
యిక ఇంతేనా బలహీన దేశాల తలరాత!
పిడుగుల్లా యుద్దటాంకులు మ్రోగుతుండే
జవానులు పిట్టల్లా నేల రాలుతుండే
సామాన్య జనులూ కుప్పగూలుతుండే
ప్రజలు,విదేశీయులు పరుగులు పెడుతుండే
విశ్వమంతా కాలుష్యంతో నిండి పోతుండే!
వొల్లు జలదరించి పోతున్నది
కంటికి కునుకు పట్టకున్నది
నోట మాట రాకున్నది
నోట్లోకి కూడు పోలేకుంటున్నది!
ఉక్రేయన్ ఏమైనా ఉగ్ర దేశమా
జెలన్ స్కీ ఏమైనా ఉగ్ర నేతనా
కూర్చుని చర్చించుకుందా మంటున్నాడు
పలు దేశాలతో చర్చలు జరుపుతున్నాడు
సార్వభౌమత్వాన్ని కాపడుకోవడం నేరమా
తన ప్రజలను రక్షించుకోవడం పాపమా
తన భూబాగాన్ని కాపాడుకోవడం ద్రోహమా
ఉక్రేయన్ లో తాను పుట్టడమే శాపమా!
పది రోజుల నుండి సంప్రదింపులే
ఇప్పటికి ఎందరో సైనికులు హతమైరి
అగ్రనేతను హతమారుస్తే చర్చల ఫలితమేమి
ఐక్య రాజ్యసమితి ఉండి ప్రయోజనమేమి!
అంతర్జాతీయ కోర్టు సుమోటోగా చేపట్టాలి
యిక నైనా ఆపాలి యిరు దేశాల యుద్దం
ప్రపంచ దేశాలు కలిసి ముందుకు రావాలి
యుక్రైన్ దేశాన్ని అన్ని విధాల ఆదుకోవాలి
యుద్దోన్మాద దేశాలపై కఠిన ఆంక్షలు విధించాలి!
No comments:
Post a Comment