Saturday, April 12, 2025

అలంకారాలు (లాటాను ప్రాస అలంకారాలు)

అంశం: అలంకారాలు

(లాటాను ప్రాస అలంకారాలు)

శీర్షిక: "శ్రీ రాము స్మరించు *జపము జపము*"

తల్లి మాట జవదాటని *కొడుకు కొడుకు*
ఋషులను అమాయకులను చంపు తాటకిని
సంహరించిన *రాముడు రాముడు*
కైకేయి దాయాది మందర చేసిన  *కుట్ర కుట్ర*
తండ్రి వాక్కు పాటించిన *పాలకుడు పాలకుడు*
రాముడిని దర్శించు *కనులు కనులు*
అయోధ్యను పాలించ భరతుడు మోసిన రాముని *పాదుకలు పాదుకలు*
రాముడిని అనుసరించిన *సోదరుడు సోదరుడు*
భర్త ధర్మాన్ని పాటించిన *భార్య భార్య*
అడవులలో రాముడు అనుభవించిన *కష్టం కష్టం*
ఆంజనేయుడు రాముడిపై చూపిన *భక్తి భక్తి*
సుగ్రీవుడు రాముడిని కోరిన *శరణు శరణు*
రామునితో విభీషణుడు చేసిన *స్నేహం స్నేహం*
రాముని పాద తాకిడితో పొందిన *మోక్షం మోక్షం*
రాముడు వాలిని హతమార్చిన *బాణము బాణము*
యుద్ధంలో లక్షణుడి మూర్ఛతో పడిపోగా బ్రతికించిన *సంజీవిని ‌సంజీవిని*
శ్రీ రాముని చేతిలో వేదశాస్త్రాలు అస్త్రశస్త్రాలు
నేర్చిన దుష్ట రావణుడి *మరణం మరణం*
ధర్మ పాలన చేసిన అయోధ్య *రాముడు రాముడు*
శ్రీ రాము స్మరించు *జపము జపము*


No comments: