అంశం: డిజిటల్ దాహం
శీర్షిక: *డిజిటల్ మీడియా బహువిధాల ప్రమాకరం*
*డిజిటల్ మీడియా*
*రెండు వైపులా పదునైన కత్తి లాంటిది*
కత్తితో పండును కోయవచ్చు
అదే కత్తితో ప్రాణాన్నీ తీయవచ్చు !
"డిజిటల్ మీడియా" ఒక తీరని దాహం
అది మనిషికి పలువిధాల ప్రమాదకరం
అలవాటు అధికమైతే మారు అది వ్యసనం
చేస్తుంది వృధా విలువైన సమయం
చేయిస్తుంది తెలియకుండానే వ్యయం
జగతిలో తీసుకొస్తుంది క్షణాలలో విప్లవం!
సోషల్ మీడియా డిజిటల్ దాహమంటే
ఇంటర్నెట్ యూట్యూబ్ వీడియోలు షార్ట్స్
రీల్స్ స్మార్ట్ ఫోన్లు ఇనిస్టాగ్రామ్ ఫేస్బుక్
వాట్సాప్ ట్విట్టర్ స్కైప్ మేయిల్స్ మరెన్నో!
*యూట్యూబ్ ఇంటర్నెట్ చరవాణీలు*
*బహుళార్థ సాధక సాధనాలు కూడా*
అరచేతిలో అద్భుతాలను చూపిస్తూ
క్షణాలలో అనేక పనులను చేసి పెడుతూ
విలువైన సమయాన్ని ఆదా చేస్తాయి!
బంధుమిత్రులకు ఆఫీసులకు కాల్స్ చేయవచ్చు
మెసేజ్ లు పంపవచ్చు వాట్సాప్ చేయవచ్చు
ఫేస్బుక్ చూడవచ్చు భావాల పంచుకోవచ్చు
ట్విట్టర్ చూడవచ్చు మేయిల్స్ పంపవచ్చు!
ఫోటోలు తీయవచ్చు పోస్ట్ చేయవచ్చు
వీడియోలు రీల్స్ చేయవచ్చు
యూట్యూబ్ ఛానల్ నడుప వచ్చు
ఆప్స్ ద్వారా షేర్స్ బిజినెస్ చేయవచ్చు!
సోషల్ మీడియాలో మంచితో పాటు నీడలా
చెడు కూడా సహజమే కదా
మీడియాను దాహంలా కాకుండా
అశ్లీలం గేమ్స్ బెట్టింగ్స్ స్కామ్స్
జోలికి వెళ్ళకుండా డిజిటల్ మీడియాను
పరిమితంగా వాడుకో గలుగుతే
ఇక అది స్వర్గధామమే!
No comments:
Post a Comment