అంశం: సామాజిక భాద్యత
శీర్శిక: *నైతిక విలువలు పాటించడం*
*నిత్యం సూర్యుడు జగతికి వెలుగు అందించినట్లు*
*నిశిలో జాబిలి విశ్వానికి వెన్నెల అందించినట్లు*
*పంచ భూతాలు జీవకోటికి సేవలందించినట్లు*
*ప్రతి మనిషి తన సామాజిక భాద్యత వహించాలి*
తన కొరకే గాక తోటి వారి కొరకు
సమాజం కొరకు తన ప్రాంతం కొరకు
దేశం కోసం నిస్వార్థంగా నిజాయితీగా
సేవలు అందించడమే సామాజిక భాద్యత!
ఇంట గెలిచి రచ్చ గెలువాలంటారు పెద్దలు
ఎవరికి వారు తమ ఇంటిని తన చుట్టూరా
పరిశుభ్రంగా ఉంచడం తల్లిదండ్రులకు సేవలు
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం చేయాలి!
అంగ వైకుల్యులకు సహాయం చేయడం
ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకోవడం
ఏదైనా ఆక్సిడెంట్ జరిగినప్పుడు
తక్షణమే పోలీసులకు తెలియపరుచడం
వెంటనే హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళడం!
ఏమైనా తిన్న తరువాత కవర్లను బాటిల్స్ ను
తినగా మిగిలిన పదార్థాలను అక్కడే బస్సులోన వదిలి వేయకుండా రోడ్లపైకి విసిరేయకుండా
జాగ్రత్త పరిచి డస్ట్ బిన్నులలో వేయడం!
తిన్న పండ్ల గింజలను రోడ్డుకిరువైపులా వేయడం
మొక్కలు నాటడం పెరిగిన చెట్లను కాపాడటం
ఇసుకను తోడకుండా వృక్షాలను నరకకుండా
పర్యావరణాన్ని రక్షిండం సామాజిక భాద్యత!
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ
నైతిక విలువలు పాటించడం సామాజిక భాద్యత!
No comments:
Post a Comment