Tuesday, April 8, 2025

ఎందుకు అలా మౌనం/సిగ్మాలు

అంశం: సిగ్మాలు

పదాలు:
*ఎందుకు* , *ఏమిటి*, *ఎలా*, *ఎప్పుడు*, *ఎక్కడ*, *ఎవరు* *ఇలా*  *చేత*, *వలె* ,*అలా*:

శీర్షిక: *ఎందుకు అలా మౌనం*

ఓ సుకుమార సుందరీ *ఎందుకు* అలా మౌనంగా ఉన్నావు?
ఓ అనురాగ కోమలి *ఎందుకు* అలా అలిగి కూర్చున్నావు?

*ఏమిటి* నీ ఆలోచనలకు కారణం?
*ఏమిటి* నీ బుంగమూతికి పరిష్కారం?

గతంలో  *ఎప్పుడు* నీవు ఇలా లేవే!
నేను *ఎప్పుడు* నిన్ను  ఇలా ఊహించు కోలేదు సుమా!

*ఎలా* ఇప్పుడు నేను ఏమి చేయాలి చెలీ!
*ఎలా* నిన్ను ఊరడించాలీ నా ప్రియ సఖీ!

*ఎక్కడ*  నా వలన పొరపాటు జరిగింది రాణి!
*ఎక్కడ* నీ మనసు బాధ పెట్టి ఉంటాను పూబోణి!

నిన్ను *ఎవరు* ఏమీ అనలేదు కదా మధుర వాణి!
నీపై *ఎవరు* కోపం చూపలేదు కదా అలివేణి!

*ఇలా* ఎంత సమయం ఆహారం లేకుండా ఉంటావు!
*ఇలా* ఉంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా!

నా *చేత* నైనా కొద్దిగా ఇడ్లీ తిను తినిపించుతాను!
నీ *చేత*  కొన్ని మంచి నీళ్ళైనా త్రాగు నీరసంగా ఉన్నావు!

మన బుజ్జాయి *వలె* ఒక్క సారి నవ్వు!
ఒక దేవత *వలె* నన్ను ఈ సారికి మన్నించు!

వావ్! ఇప్పుడు మనం *అలా* సినిమాకు వెళ్దామా సరదాగా!
ఆహా! వెళ్తుంటే జనం *అలా* చూస్తుంటారు మనలను ఓరగ!

No comments: