Friday, April 18, 2025

హాస్య కవిత / టిట్ ఫర్ టాట్

అంశం:హాస్య కవిత 


శీర్షిక:  *టిట్ ఫర్ టాట్*

రాము స్నేహితుడు వెంకన్నతో 

"వెంకన్నా! తాటి చెట్టు క్రింద నిలబడి 

ఏమి చేస్తున్నావ్ ?"

"ఆ.. ఏమీ లేదు పాలు త్రాగు తున్నా "

ఓహో అలానా!


"సరే రాము! మండువలో కూర్చుని 

నీవు ఏమి చేస్తున్నావు?

ఆ.. ఏమీ లేదు పాలకుండలు లెక్కబెడుతున్నా

ఓహో అలానా!


"రాణీ! నీకు దశరధుడు తెలుసా" అంటాడు 

భర్త భార్యతో గోముగా 

ఓ తెలుసు, ఎందుకూ..

"దశరధుడికి ముగ్గురు భార్యలు 

కౌసల్య కైకేయి సుమిత్ర కదా" అంటాడు భర్త

"ఆ.. తెలుసు అయితేంది ఇప్పుడు' 

అంటుంది భార్య  కాస్త సీరియస్ గానే 

"నాకు నీవు ఒక్కదానివే భార్యవు కదా

ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకుందామనీ"

అంటు గుణుగుతాడు భర్త!


ఓహో..అలా వచ్చావా అని మనసులో

అనుకుంటుంది  భార్య 

ఏమండోయ్ రాజు గారూ!

"నీకు ద్రౌపది తెలుసా?" అని అడుగుతుంది 

భార్య రాణి 

"ఓ.. నాకెందుకు తెలియదు" 

"అయినా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు?"

అంటాడు కోపంగా భర్త 

"ద్రౌపదికి  ఐదుగురు భార్యలు కదా"

"నాకు నీవు ఒక్క భర్తవే 

నేను మరో నలుగురు భర్తలను 

పెళ్లి చేసుకుంటాను" అని అంటుంది 

సిగ్గులొలక బోస్తూ  భార్య 

మనసులోనే అర్ధం చేసుకున్న భర్త 

"ఆవును... నీకు పట్టు చీర తెచ్చానూ చూడు 

ఎలా ఉంది" అంటూ మాట మారుస్తాడు భర్త రాజు!

No comments: