Saturday, April 19, 2025

హాస్య కవిత/కార్తీక దీపంలో వంటలక్క

అంశం: హాస్య కవిత 


శీర్షిక: కార్తీక దీపంలో వంటలక్క... 


ఎక్కడెక్కడో తెస్తాడు మా నాన్న 

బలేగా పిసుకుతుంది అమ్మ 

ఏవేవో ఇంగ్రేడియెంట్స్ కలుపుతుంది 

అవి ఏమిటంటే చెప్పదు 

బిజినెస్ సీక్రెట్ అంటుంది 

హోటల్లలో లాగా చేతికి గ్లౌజులు వేసుకోదు

ముఖానికి మాస్కులు పెట్టుకోదు 

ముందుగా ముద్దలు ముద్దలుగా 

గుండ్రంగా చేసి పెట్టుకుంటుంది 

కార్తీక దీపంలో వంటలక్కకూడా

అమ్మలా ఇంత బాగా చేయదండోయ్

ఫాయివ్ స్టార్ హోటల్ వారు కూడా చేయలేరు 

కానీ అమ్మ  తయారు చేస్తుంది 

అది కూడా చాలా పొదుపుగా 

తక్కువ ఖర్చుతో చేస్తుంది 

గంటల కొలది కూర్చుంటుంది 

అయినా ఆయాసపడదు 

నిప్పు మంట తగలదు పొగ ముఖాన కొట్టదు

ఎందుకంటే అమ్మ వాడేది సోలార్ పవర్

అప్పటికే గుండ్రంగా చేసుకున్న ముద్దలను 

టప టపా కొడుతుంది 

బలే తయారవుతాయండి ఉబ్బెత్తుగా 

అదే అమ్మ లోని గొప్పతనం అమ్మలోని కళ

అమ్మమ్మ దగ్గర నేర్చుకుందట

సోలార్ పవర్ కదండీ 

కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది 

అదొక్కటే దీనిలో ఉన్న బలహీనత 

ఆ తరువాత ఇక ఎన్ని రోజులైనా 

వంట చేసుకోవచ్చు వరుగుల్లా 

చక్కగా పొయ్యిలో పెట్టి ఉపయోగించ వచ్చు 

అదే నండి పేడ ఉనకతో చేసిన "పిడకలు"

No comments: