Thursday, April 10, 2025

ఓ.. మాయావి పాట

అంశం: ట్యూన్ లిరిక్స్


శీర్షిక: *ఓ..మాయావి*

కోరస్:
అతడు:
మాటలు లేవు...
పలుకులు లేవు..
ఆకాశం అంతు లేనిదీ....
భూగోళం విశాలమైనదీ...
నక్షత్రాలను అందుకో గలమా....

పల్లవి:
ఓ...ఓ..ఓ...మాయా..నీవు మయావివే....
నా హృదయంలో రగిలే జ్వాలవే ...
నా గుండెలో మండే నిప్పు కనికవే...
నా మదిలో మెదిలే తారవే....
ఓ...ఓ..ఓ.. మాయావివే ....
నీవు నా దానివే... నా.. దానవే...         "ఓ...ఓ.."

చరణం:01
అతడు:
హూం...హూం....హూం...హూం....
నీవు రోడ్డు మీద నడుస్తుంటే.....
సముద్రాలు ఆకాశం....
కలిసి లయవేస్తున్నట్లున్నదే....
నన్ను నీకు అర్పించుకున్నానే...
నా హృదయంలో నీవే ఉన్నావే...
ఓ...ఓ...ఓ...కోమలీ...
నాలో నే  నిదుర పోవే....
ఓ ...ఓ ...నాగుండెలోనే నిదుర పోవే...
బయట ఎంత కాలం ఉంటావే ....
నీ కోసం నేను కిటికీ దగ్గరే నిలబడ్డానే .....   *ఓ..ఓ.."

చరణం:02
అతడు:
నా మదిలో నీవే ఉన్నావే...
నా గుండెలో నీవే ఉన్నావే ....
నా గుండే ఆగిపోతే....
ఇక పలుకులే ఉండవే...
ఆపై ఉలుకులే ఉండవే...
మాయా.... మాయావివే...
నా  అనురాగ మల్లియవే....
నాలోనే నిదుర పోవే....
ఓ..ఓ..ఓ... నాలోనే నిదుర పోవే....
బయట ఎంత కాలం ఉంటావే...
నీ కోసం నేను కిటికీ దగ్గరే నిలబడ్డానే...   "ఓ..ఓ..ఓ."

చరణం:03
అతడు:
నా అంతరంగంలో నీవేనే...
నా ఆత్మ లోన నీవేనే....
నా శ్వాస లోనా నీవేనే....
నా ధ్యాస లోనూ నీవేనే....
నీవు లేకుండా నేను లేనే...
ఓ మధుర స్వప్నమా....
మాయా....ఓ...మాయావివే...
నాలోనే నిదుర పోవే....
ఓ...ఓ..ఓ.. నాలోనే నిదుర పోవే...
బయట ఎంత కాలమని ఉంటావే...
నీ కోసం నేను కిటికీ దగ్గరే నిలబడ్డానే....  "ఓ...ఓ.."


No comments: