Friday, April 18, 2025

హాస్య కవిత / అయ్యా అవధానీ

అంశం: హాస్య కవిత


శీర్షిక: "అయ్యా అవధానీ!"

అయ్యా అవధానీ అవధానం చేసే వారికి
"చప్పట్లంటే" ఇష్టమట కదా
అదేమీ లేదోయ్ నాకు "చప్పటట్ల" కంటే
"కారపు అట్లంటే" మహా మహా ఇష్టమోయ్!

అయ్యా అవధానీ గారు
మొన్నీమధ్య మీ ఇంటికి వచ్చినప్పుడు
మీరు 'పశువ" అంటే మీ ఆవిడ "కోతి'
అంటుంది బలే సరదాగా ఉంటారండీ మీరు!

అదేమీ లేదోయ్ 'పశువ" అంటే
"పరిశుభ్రమైన ఆహారం వడ్డించు". అని
"కోతి" అంటే  "కోరినంత తినండి" అని
ఓహో అలానా బాగుందే మీ కోడ్ భాష!

అయ్యా  అవధానీ గారు
మా మొదటి అమ్మాయి పేరు "గోపిక" పెట్టాము
మా రెండవ అమ్మాయి పేరు "దీపిక" పెట్టాము
మా మూడవ అమ్మాయి పేరు
ఏమి పెట్టమంటారు?
గురువు గారు సమాధానం  "ఆపిక" !

చివరగా ఒక్క ప్రశ్న అవధానీ గారు
అవధానికి "అశువులు" ఎప్పుడొస్తాయి
"అశ్రువులు" ఎప్పుడొస్తాయి?
ప్రశ్న వేసినప్పుడు "అశువులు" వస్తాయి
సత్కారం ఎగరగొట్టినపుడు"అశువులు" వస్తాయి!

No comments: