Thursday, April 3, 2025

అనుమానం పెనుభూతమా?

అంశం: సంశయ స్వరం 

శీర్షిక: *అనుమానం పెనుభూతమా?


*సంశయాత్మా వినశ్యతి* అనేది లోకోక్తి 

సంశయంతో ఒక నిర్ణయానికి రాలేక

సందిగ్ధంలో కొట్టుమిట్టాడటం

అనిశ్చితి స్థితిలో ఉండి పోవడం!


మంచో చెడో అనుకూలమో ప్రతికూలమో 

ఒక నిర్ణయానికి రాలేకపోవడం

"దేవుడున్నాడు"  "దేవుడు లేడు" 

"దేవుడు ఉన్నాడో లేడో తెలియదు" 

"దేవుడు ఉన్నాడనీ చెప్పలేను 

అలాగని దేవుడు లేడనీ చెప్పలేను" 

అనేది "సంశయస్థితి"


సంశయం వేరు అనుమానం వేరు 

సంశయం అనిశ్ఛితి ని సూచిస్తే 

అనుమానం అజ్ఞానాన్ని తొలగించడాన్ని 

సూచిస్తుంది 

ఈ రెండూ నమ్మకానికి బద్ధ శత్రువులే


అనుమానాన్ని అసహ్యించదు 

అవమానించదు మన సనాతన ధర్మం 

అనుమానం లేకుంటే అజ్ఞానం తొలగదు 

జ్ఞానం లభించదు 


సంశయ స్వరం వలన కష్టాలు నష్టాలు 

బాధలు దుఃఖాలే తప్పా 

సుఖాలు సంతోషాలు ఆనందాలు 

లాభాలు ప్రయోజనాలు ఉండవు


కానీ మన పెద్దలు, 

*అనుమానం పెనుభూతం* అంటారు 

కొన్ని విషయాలలో అనుమానం 

పెనుభూతమే కావచ్చు, కానీ 

ప్రతి విషయంలోనూ భార్య భర్తను 

భర్త భార్యను, యజమాని ఉద్యోగిని 

ఉద్యోగి యజమానిని , పక్కింటి వారిని 

ఎదురింటి వారిని అనుమానించడం 

మొదలు పెడుతే అది కాస్తా

పెనుభూతంగా మారుతుంది 


ప్రతి సారీ సంశయ స్వరమే వినిపిస్తే 

ఎదుటి వారిలో నమ్మకం కోల్పోతారు 

అవమానాల పాలవుతారు 

ఆ తరువాత మాటకు విలువ ఉండదు 


అలానే అన్ని వేళలా పూర్తిగా నమ్మడం 

కూడా సరియైనది కాదు 

*ఆలస్యం అమృతం విషం*

అనుమానించడం ఆలస్యం అవుతే 

సర్వం కోల్పోవల్సి వస్తుంది 

వెతకడానికి ఇంకా ఏమీ మిగలదు 

అనుమానిస్తేనే అజ్ఞానం తొలుగుతుంది 

సంశయిస్తేనే నిజాలు వాస్తవాలు సత్యాలు 

వెలుగు లోకి వస్తాయి 

పోలీసులకు పరిశోధకులకు అనుమానం 

లేకుంటే సత్యాలను చేధించలేరు 


అనుమానమైనా నమ్మకమైనా 

బ్యాలెన్స్ గా ఉండటం ఉత్తమం 


No comments: