Thursday, April 3, 2025

పదపద ముందుకు

అంశం: అభ్యుదయం


శీర్శిక: *పదపద ముందుకు*

పదపద ముందుకు నడుం బిగించి
పదపద ముందుకు సంకెళ్లు బుద్దలుకొట్టి
ఎంత కాలం ఈ అమాయకత్వం
ఇంకెంత కాలమోయ్ ఈ బానిసత్వం!

హామీలు అటకెక్కే
మాటలు కోటలు దాటే
ఆశలు ఆకాశహార్మ్యాలు
ఊహలతో ఇంద్రధనుస్సులు
ఉచితాలతో ఊడిగం పధకాలతో ప్రాబల్యం
నిరంకుశ పాలనతో ఆదిపత్యం
పదపద ముందుకు నడుం బిగించి
పదపద ముందుకు సంకెళ్లు బద్దలుకొట్టి
ఎంత కాలం ఈ అమాయకత్వం
ఇంకెంత కాలమోయ్ ఈ బానిసత్వం

అవే ఓటు బ్యాంకు పధకాలు
అవే కుల మతాల కుమ్ములాటలు
అవే అవినీతి భూకబ్జా దందాలు
అవే క్విడ్ ప్రో పధకాలు  అవినీతి బాండ్లు
తిలా పాపం తలా పిడికెడు

కలం పట్టు కాగితంపై పెట్టు
గళం విప్పు ఘన స్వరం పెంచు
పదపద ముందుకు నడుం బిగించి
పదపద ముందుకు బానిస సంకెళ్లు బద్దలుకొట్టి!

No comments: