*నేటి అంశం* *అలక*ఎందుకో*
శీర్షిక: *ఎందుకో అలక!*
ఓ నా కలల రాణి
అందాల సుందర పూబోణి
మధుర మనోహర వీణావాణి
హొయల సోయగాలతో నా యెదమీటే రాణి!
ఎందుకో అలక
ఓ నా బంగారు చిలుక
అనురాగాల ఆనందాల మొలక
కాస్తనైన విడదీసి చెప్పవే ఆ మలక!
వెన్నెల జాబిలి లాంటి నీ మోము
కలువ రేకుల వంటి నీ కనులు
హంస రెక్కల వంటి నీ కనురెప్పలు
తామర తూడుల వంటి సన్నని నీ నడుము!
ఓ నా మంజరీ ఎందుకో ఆ అలక
నాకు తలలో పిలక జుట్టు ఉందనా
ఇంట్లో ఎలుక ను పారదోల లేదనా
నిన్ను చెలుక కు తీసుకపోలేదనా
మలక విప్పవే మెలిక తీయవే ఓ వయ్యారీ!
No comments:
Post a Comment