Tuesday, April 1, 2025

ఒకే మాట ఒకే బాణం రాముడి తత్వం

శీర్షిక: ఒకేమాట ఒకే బాణం రాముడి తత్వం


అయోధ్య రాముడు రఘుకుల సోముడు
దశరధుడి పుత్రుడు పితృవాక్య పాలకుడు
సీతా లక్ష్మణులు వెంట రాగా పదునాలుగు
వత్సరములు వనముల కేగే శ్రీ రామచంద్రుడు!

కోదండ రాముడి తత్వం వేదామృతం
ఒకే మాట ఒకే బాట ఒకే భాణం
ఆలోచన ఉన్నతం ఆశయం మహోన్నతం
రఘుకుల సోముడు శ్రీ రామచంద్రుడు!

రాక్షసులనుశిక్షించి ఋషులను రక్షించాడు
రాతిని తాకి అహల్యకు మోక్షం కలిగించాడు
శబరి ఎంగిలి తిని ఆత్మీయు డయ్యాడు
ఏక పత్నీ వ్రతుడు శ్రీ రామచంద్రుడు!

ఇచ్చిన మాటకు కట్టుబడి వాలిని హతమార్చి
సుగ్రీవుని కిష్కింధకు రాజును చేేసే
ధర్మబద్ధంగా లవకుశులతో యుద్ధం చేసి
ధవళ అశ్వాన్ని తోడుకుని అయోధ్య కేగే!

హనుమను భక్తుడిగా స్వీకరించే
భక్తుడి సాయంబున జానకి జాడ తెలిసే
రావణుడిని హతమార్చి లంకలో విభీషణుడికి
పట్టాభిషేకం చేసే శ్రీ రామచంద్రుడు!

శ్రీ సీతారాముడు లక్ష్మణుడి సమేతముగా
అయోధ్య కేగే పట్టాభిషేకం జరుగగ
ధర్మపాలనతో ప్రజలెంతో సంతోషించే
రామ రామ అని జపము చేసిన చాలు
వరములు కురుపించు అయోధ్య రాముడు!

హామీ: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు 

No comments: