*నేటి అంశం*చిత్ర కవిత*
శీర్షిక: *పొగడ తరమా నీ కీర్తి రామా!*
రామా పరంధామా అయోధ్య రామా
ఏమి నీ చరితము ఏమీ నీ లీలలు
దివి నుండి భువికి దిగివచ్చిన రామా
ఏమీ నీ సుందర మనోహర అవతారాలు!
త్రేతాయుగంలో దశరథుడి కౌసల్యల
పుత్రుడిగా జన్మించావు మానవుడిగా
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు
అస్త్రశస్త్ర విలు విద్యలను నేర్చావు!
ఒకే బాట ఒకే బాణం అంటూ ఋజువు చేస్తూ
నీతి నిజాయితీ ధర్మ పాలనతో
జాలి దయ కరుణ అను సుగుణాలతో
దేవుడవయ్యావు జగతిలో శ్రీ రామా !
శివ ధనుస్సు విరిచి జనకుడి కూతురైన
సీతను వివాహమాడి అయోధ్య కేగగ
మాయావి మందర కైకేయి నెగవేయ
కోరే నీ తండ్రిని , నినునడవికి పంపమని
సోదరుడు భరతుడికి పట్టాభిషేకం చేయమని!
పితృ మాట జవదాటని పరంధామా
అడవి కేగితివి పదునాలుగు వత్సరములు
సీతమ్మ తమ్ముడు లక్ష్మణుడు వెంటరాగా
అష్టకష్టాలు పడుతూ రాక్షసుల సంవరించి
ఋషులను రక్షించి, అహల్యకు శాపం
విముక్తి గావించి, శబరికి ఆత్మీయుడవైతివి!
వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యమప్పగించి
రావణుడపహరించిన జానకి జాడను
పరమ భక్తుడు హనుమ దెలుపగనే
లంకకేగి రావణుడితో తలపడి సంవరించి
విభూషణుడికి లంక నప్పగించితివి రామా!
సీతా సమేతంగా అయోధ్యకేగి
ధర్మ పాలన చేసితివి కోదండరామా
ఏమీ నీ లీలలు రఘుకుల సోమా
రామ రామ అని పలికిన చాలు
కోరిన కోరికలు తీర్చే శ్రీ సీతారామా
పొగడతరమా నీ గొప్పలు అవనిన భక్తులకు!
No comments:
Post a Comment