శీర్షిక: కాళోజీ
తెలుగన్నా ప్రేమ
వెలుగన్నా ప్రేమ
తెలంగాణన్నా ప్రేమ
తెలుగు భాషన్నా ప్రేమ!
"తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడెదవు సంగతేమిటిరా "
అంటూ తెలుగు భాషను ముద్దాడిన
తెలంగాణ బిడ్డడు తాను !
అక్షర రూపంలో పేర్చిన
ఒక్క సిరా చుక్క
లక్షమెదళ్ళను కదల్చునని
తేల్చి చెప్పిన అక్షర జ్ఞాని
నిప్పు రవ్వల్లాంటి పదాలను చిమ్మిన
ఓరుగల్లు బిడ్డడు మన కాళోజీ!
"అభ్యర్ధి ఏ పార్టి వాడని కాదు
ఏపాటి వాడిని చూడు " అని
ఓటర్లను నాడే హెచ్చరించిన
ప్రజా కవి కాళోజీ!
"అన్యాయాన్ని ఎదిరించు వాడే
నాకు ఆరాధ్యుడని"
నిర్మొహమాటంగా ప్రకటించిన
విప్లవ కవి మన కాళోజీ!
జయప్రకాష్ నారాయణ్
దివంగతులైన సంధర్భంగా
"పుట్టుక నీది చావునీది
బ్రతుకంతా దేశానిదని "
కుండ బద్దలు కొట్టి చెప్పిన
మహానీయుడు కాళోజీ!
జాతిపిత గాంధీ వారసుడు
జనుల జాగృతం చేసిన ధీరుడు
నవాబును గడగడ లాడించిన ఘనుడు
బడుగు జీవులకు ఆరాధ్యుడు కాళోజీ!
బీదల గొడవనే
తన గొడవగా భావించి
ప్రభుత్వ నేతలకు సింహస్వప్నంలా తలపించి
బంగరు తెలంగాణ కొరకు తానూ విలపించే!
మండుతున్న సూర్య గోళంలా
రగిలిన నిండు హృదయం
పేద తనంలోనే మ్రగ్గింది యవ్వనం
తెలుగు వారసుడిగా నిలిపింది జీవితం!
కాళోజీ ఘనతను మెచ్చి ప్రభుత్వం
తన పుట్టిన రోజును సెప్టెంబర్ తొమ్మిదిని
"తెలంగాణా భాషా దినోత్సవం" గా ప్రకటించి
చరిత్రలో శాశ్వతంగా నిలిపింది
No comments:
Post a Comment