Saturday, March 1, 2025

ఉపమాలంకారం

ఉపమాలంకారము


*ఉపమేయమును ఉపమానము తో మనోహరంగా పోల్చి చెప్పుటను ఉపమాలంకారము అంటారు*.


1. ఉపమేయం.. *పోల్చబడుతున్న ఉన్న వస్తువు*


2. ఉపమానం.. *పోల్చుట కు తీసుకున్న ప్రసిద్ధమైన వస్తువు*.


3. సమాన ధర్మం ...    *ఉపమాన ఉపమేయములకున్న*  *సమాన* *ధర్మము*


3. ఉపమావాచకం

 *ఉపమాన ఉపమేయంల మధ్య గల సమాన* *ధర్మమును  తెలుపు పదములు*

*లా, లాగా , వలె, వోలె*, 

 మొదలగునవి



ఉదాహరణ..

నీనవ్వులు చంద్రుని వెలుగుల వలె ప్రకాశిస్తున్నాయి 


1. నీ నవ్వులు. .... ఉపమేయం

2. చంద్రుని వెలుగులు... ఉపమానం

3. ఉపమా వాచకం... వలే

4. సమాన ధర్మం ... ప్రకాశించడం


2. పాప నెమలి లాగా నృత్యం చేస్తుంది


1. పాప..   ఉపమేయం

2.నెమలి  .... ఉపమానం

3. ఉపమా వాచకం...లాగా

4. సమాన ధర్మం... నృత్యం


3. ఓ కృష్ణ నీ కీర్తి హంసవలె ఆకాశగంగ  యందు మునుగు చున్నది


4. ఓ చెలీ! నీ మాటలు చిలుకపలుకుల వలె ఉన్నవి.


No comments: