Saturday, March 1, 2025

రాధా! నీ ప్రేమ

అంశం: చిత్ర కవిత


శీర్షిక: రాధా! నీ ప్రేమ

రాధా!...ఏమీ నీ సిగ్గు శివుని సిగలో చంద్రికలా
జీవ కళ నింపుకున్న పుష్పం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణం
తళతళ మెరిసే సుగంధ పరిమళాల స్వర్ణ కమలం!

నా రాధా!....తుమ్మెదలు వాలని స్వచ్ఛమైన
గుభాలించు కుసుమం
చిరు గాలి సోకని చిత్ర విచిత్రాల ఇంపైన సంపెంగ కుసుమం
సూర్య రస్మి సోకని ఎరుపెక్కిన సుగంధాల మకరందాల మందారం!

నా రాధా!... నీవు వర్షపు చుక్క తాకని సుకుమార
స్వేత గులాబీల పరిమళం
నీ కలియక నాలో సంతోషాలు నింపుతాయి
జగతిలో సరిగమలు పాడుతాయి
మదిలో ఆనందాలు నింపుతాయి ఆహ్లాదాలు కురిపిస్తాయి
మధురామృతాలు చిలుకుతాయి మహాద్భుతాలు సృష్టిస్తాయి జనుల గుండెలలో!

రాధా!... నీ ప్రేమ గలగల పారే జలపాతంలా
స్వచ్ఛమైన గంగా నదిలా
ఆకాశంలో  చిరు గాలిలో  తేలిపోయే తెల్ల మబ్బుల్లా
మిలమిల మెరిసే నక్షత్రాల్లా, నిండు పున్నమి జాబిలిలా!

శశి చూపులతో పరవసించి విప్పారిని కొలనులోని కలువల్లా
విరిచిన నిండు గర్భిణి మల్లెల సుగంధాల మకరందాల్లా
ఆకాశంలో విరిసిన అద్భత సప్తవర్ణ ఇంద్రధనుస్సులా
వెలిగి పోతున్నాయి
స్వచ్ఛమైన మన కలయిక ఎంతో అద్భుతం ఆనంద మయం!

No comments: