అంశం: ఉపమాలంకారాలు
శీర్షిక: నా ప్రియ సఖీ...
సఖీ...! ఏమీ నీ మోము శివుని సిగలో
*గంగ వోలే* నిండుగా ఉంది
నీ అందం తళతళ మెరిసే సుగంధ పరిమళాల స్వర్ణ *కమలంలా* ఉంది!
నా సఖీ....! నీ ఆహార్యం తుమ్మెదలు వాలని
స్వచ్ఛమైన మకరంద *కుసుమంలా* ఉంది
నీ పెదాలు సూర్య రస్మి సోకని ఎరుపెక్కిన సుగంధాల మకరందాల *మందారంలా* ఉన్నవి
ప్రియ సఖీ... ! నీ మనసు వర్షపు చుక్క తాకని
సుకుమార స్వేత గులాబీల *పరిమళంలా* ఉంది
నీ గానం కోకిల *రాగంలా* మధురంగా ఉంటుంది
నా సఖీ.....! నీ ప్రేమ గలగల పారే జలపాతంలా
స్వచ్ఛమైన *గంగా నదిలా* ఉంటుంది
సఖీ.... నీ కురులు ఆకాశంలో నల్లని *మేఘాల వలె* ఉంటాయి
ప్రియ సఖీ.. నీ వాలు జడ "నాగ సర్పం వోలే* నేల తాకుతుంది
నీ పళ్ళు మిలమిల మెరిసే *నక్షత్రాల్లా* , నిండు పున్నమి *జాబిలిలా* ఉంటాయి!
ప్రియ సఖీ...! నీ బుగ్గలు శశి చూపులతో పరవసించి విప్పారిని కొలనులోని *కలువల్లా*
విరిచిన నిండు గర్భిణి మల్లెల సుగంధాల *మకరందాల్లా* ఉంటాయి
సఖీ... నీ హృదయం ఆకాశంలో విరిసిన అద్భత *సప్తవర్ణ ఇంద్రధనుస్సులా* వెలిగి పోతున్నది
No comments:
Post a Comment