Sunday, March 2, 2025

కాదేదీ కవిత కనర్హం

శీర్షిక: *కాదేది కవితకనర్హం!*

*కుక్క పిల్ల*

*అగ్గిపుల్ల*

*సబ్బు బిళ్ళ*

కాదేది కవితకనర్హం ,

అంటారు *శ్రీ ,శ్రీ*!


మద్యం త్రాగే వారికి

పద్యం ఎదో గద్యం ఎదో  

కవిత  ఎదో  వచనం ఎదో

అర్ధం కాదు  మనవారెవరో

పరవారెవరో  అర్ధం కాదు

కాదు కాదు  అవుతుంది

మద్యం దిగాక  లేదా

సాటి  వారిని అర్ధం

చేసుకున్నాక!


జీవితం పై విరక్తి

చెందాక ముసలి తనం

లోనే వ్రాశాడు

*వేమన* , పద్యాలు.

ఏమి చదివెనో , ఎలా వ్రాసేనో

సంకలనం చేసిన ,

*సి .పి. బ్రౌన్* కే ఎరుక .


కటిక జీవితాన్ని

అనుభవిస్తూ ,

ఒక్క సిరా చుక్క

వేయి మెదళ్ళు  

కదిలించు నన్న  

*కాళోజీకి*  తెలంగాణా

వచ్చాకనే ,కాటికి కాలు

సాచాకనే వచ్చింది  

గుర్తింపు!


ఒక  ఇంర్వ్యూ లో

పది పాసయ్యావా 

ఫెయిలయ్యవా

అని అన్నాకనే 

వచ్చింది పట్టుదల

*సుద్దాల అశోక్ తేజ* కు

(అప్పటికే  వారు ఎం. ఏ.

గోల్డ్ మెడలిస్ట్ )!


గద్దరన్న , ఒక్క మీటింగ్

అటెండవుతే చాలు,

పుట్టుకొస్తాయి

విప్లవ గీతాలు!


*గోరెటి వెంకన్న*

జానపద గీతాలు 

గగన కుసుమాలు 

ఎవరిగళం  వారిదే 

ఎవరి కలం వారిదే!

No comments: