అంశం: విలువలు అంతరిస్తున్నాయి
శీర్షిక: *మానవ విలువలు, నాడు-నేడు*
మమతానురాగాలతో బ్రతికే వారు నాడు!
నటనతో బ్రతుకుతున్నారు నేడు!!
ప్రేమాప్యయతలు తరువులు నాడు!
ప్రేమాప్యయతలు కరువులు నేడు!!
పండుగలు ప్రభోజనాలకు రోజుల
తరబడి చుట్టాలు నాడు!
గంటలు నిమిషాలే చుట్టాలు నేడు!!
ఉమ్మడి కుటుంభాలతో కళకళలాడే వారు
నాడు!
ఒంటరి కుటుంభాలతో ఏకాకులవుతున్నారు నేడు!!
ఇంటి పెద్దలే పెత్తనం చేసేవారు నాడు!
ఇంటిల్లి పాది పెత్తనమే చేస్తారు నేడు!!
సమస్యలు , విడాకులుండేవి కావు నాడు!
ఇంటీంటికి సమస్యలు , విడాకులే నేడు!!
పెద్దలంటే గౌరవం ఉండేది నాడు!
పెద్దలంటే లెక్కలేదు నేడు!!
ఏమీ లేకుంటే పస్తులుండే వారు నాడు!
అప్పులు చేసి ఎగ్గొడుతారు నేడు!!
మడి కట్టుకుని వంట చేసేవారు నాడు!
టిఫిన్లు టీ లయ్యాక స్నానం చేస్తారు నేడు!!
వచ్చిన చుట్టాలు వెళ్ళొద్దని చెప్పులు
ఊత కర్ర, సంచులు దాచేవారు నాడు!
ఎప్పుడు వెళ్తారా అని ఎదురుచూస్తారు నేడు!!
బంధు మిత్రులు కనిపిస్తే పలక రించేవారు నాడు!
బంధు మిత్రులు కనిపిస్తే తల దించుకొని
పోతున్నారు నేడు!!
ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే వారు నాడు!
ఏ ఆపద వచ్చినా పట్టించుకోరు నేడు!!
కలుస్తే కడుపునిండా మాట్లాడుకునేవారు నాడు!
కలిసినా ఎవరి చరవాణి లో వారు బిజీగా ఉంటున్నారు నేడు!!
దొంగతనాలు , హత్యలు అత్యాచారాలు
అల్పం నాడు!
దొంగతనాలు , హత్యలు అత్యాచారాలు
అనల్పం నేడు!!
పితృ కర్మలు ఘనంగా చేసేవారు నాడు!
పితృ కర్మలు గగన కుసుమం నేడు!!
కొన్ని తరాలను వావి వరుసలతో
పలకరింపులు నాడు!
ఒక్కతరం వావి వరుసలంటేనే
ఏవగింపులు నేడు!!
వృద్ధులను అభివృద్ధులుగా చూసేవారు నాడు!
వృద్ధులను వ్యర్ధులుగా చూస్తున్నారు నేడు!!
డబ్బు అహంతో విర్ర వీగుతున్నారు జనులు!
జీవితం నీటి మీద బుడగ అని తెలియకున్నారు!!
No comments:
Post a Comment