Wednesday, March 5, 2025

బేబీ బచావో....బేబీ పడావో

అంశం: బేబి బచావో..బేబి పడావో


శీర్షిక: *బహుముఖ ప్రజ్ఞాశాలురు*

గొడుగుకు పైబట్ట నాన్నవుతే
ఆ గొడుగుకు తోడుగ స్టాండ్ అమ్మ
లోపల చుట్టూరా పుల్లలే పిల్లలు
అలా నాన్నకు తోడుగా ఉంటూ
ఇంటిల్లిపాదికీ రక్షణ ఇచ్చేది అమ్మ!

అమ్మగా, ఆలిగా , అక్కగా ,చెల్లిగా  పిన్నిగా,అత్తగా,స్నేహితురాలిగా
సలహాదారుగా , సేవకురాలిగా
తన ప్రేమను పంచుతూ!

అనేక భాద్యతల నెరవేరుస్తూ
సమయపాలన పాటిస్తూ
గృహానికి  సి.ఇ.వో. గా బంధాలను
బంధుత్వాలను పటిష్టపరుస్తూ
పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ!

తమ జీవితాలను కొవ్రొత్తిలా
కరిగించు కుంటూ వెలుగులు పంచే
నిస్వార్ధ జీవులు మహిళలు
ఆదర్శనీయులు వనితలు!

నిరంతరం పలు సేవలనందిస్తూ 
సకల సద్గుణాలతో , సప్తవర్ణాలతో
చతుష్షష్టి కళలలో ఆరితేరిన
ఆరాధ్య దేవతలు స్త్రీలు!
   
సెలవు లేకుండా  జీతం లేకుండా
నిత్యం శ్రమిస్తూ జీవితం త్యాగం చేస్తూ
ఒక వైపు వృత్తి భాద్యతలు
మరో వైపు కుటుంబం కొరకు అలోచిస్తూ
సంసారాన్ని తీర్చి దిద్దే ఏకైక వ్వక్తి స్త్రీ!

వివిధ రంగాలలో రాణిస్తూ
తమ వంతు పాత్రను పోషించిన
మహిళా మణులు వీర నారీ ఝాన్చి  
రాణి రుద్రమ దేవి,అనీబి సేంట్  దేశ్ ముఖ్ 
సేవా రత్న మథర్ థెరిస్సా
భారత రత్న ఇందిరా గాంధీ
క్రీడా కారిణి సింధుజా ,
గాన కోకిల సుబ్బలక్ష్మి , కేంద్ర ఆర్ధికమంత్రి
నిర్మల సీతా రామన్  మరెందరో
 
జగతిన లక్షలాది మంది  మగువలు
మగవారికి  ధీటుగా వారి ప్రతిభను
చాటినారూ.. చాటుతున్నారు
మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా
ఎవరికీ తీసి పోరని నిరూపిస్తున్నారు!

అందుకే *బేబీకో బచావో ...బేబీకో పడావో*
అనే స్లోగన్ వాడుకలోకి వచ్చింది

ఒక స్త్రీ యెదుగుల వెనుకాల
ఒక మగవాడు ఉన్నట్లే
ఒక పురుషుడి అభివృద్ధి వెనుకాల
ఒక స్త్రీ ఉంటుందనేది జగమెరిగిన నగ్న సత్యం!

No comments: