అంశం: నాడు నేడు సంసారం
శీర్షిక: నాడు - నేడు మానవ జీవితాలు
*నాడు* పెళ్ళంటే నూరేళ్ళ పంటగా
భావించేవారు
*నేడు* పెళ్ళంటే నూరేళ్ళ తంటగా
భావిస్తున్నారు!
*నాడు* పద్దెనిమిది యేళ్ళు దాటుతే
వివాహం చేయాలనే వారు
*నేడు* ముప్పది యేండ్లు దాటినా
వివాహం వద్దనుకుంటున్నారు!
*నాడు* సంసారాలు అనేవి ఓ నిశీలో జరిగేవి
జీవితాలు వెలుగులో ఉండేవి
*నేడు* సంసారాలు వెలుగు లోకి వచ్చాయి
జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి!
*నాడు* కప్పుకొన్న రహస్య శరీరభాగాలు
*నేడు* బహిరంగంగా చూపిస్తున్నారు
*నాడు* చూపించాల్సిన దయార్ద్ర హృదయాలు
*నేడు* అహంకారంతో కప్పేస్తున్నారు!
*నాడు* సభ్యులకు కష్టమొస్తే
కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు
*నేడు* కొన్ని కుటుంబాలలో కలహాలకు
పెద్దలే కారణం మవుతున్నారు!
*నాడు* జీవించడానికి
శ్రమించి సంపాదించే వాళ్ళు
*నేడు* కదల కుండా కూర్చుని సంపాదిస్తూ
తిన్నది అరగడానికి వాకింగ్ జాగింగ్ చేస్తున్నారు
*నాడు* పండ్లు, పాలు తిని త్రాగి
బలంగా అధికమందిని కని పెంచేవారు
*నేడు* సంసారం చేయడానికే
మందులు మింగినా పిల్లలు కావడం లేదు!
*నాడు *వైద్యులు
ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవారు
జిందాతిలస్మాత్ కే జబ్బులు తగ్గేవి
*నేడు* తలకాయనొప్పికే
లక్షల అప్పు చేయాల్సి వస్తుంది!
*నాడు* మంచి చెడులు
పది మందిలో కూర్చుని మాట్లాడుకునే వారు
ప్రశాంతంగా జీవించే వారు
*నేడు* దేనికైననూ
గూగులమ్మనే అడుగుతున్నారు
చరవాణి లోనే మునిగి పోతున్నారు
ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు!
*నాడు* దొంగలు రాత్రిళ్లు
నట్టింట్లో దోచుకెళ్ళేవారు
*నేడు* దొంగలు పట్టపగలు దొరల్లాగా
నెట్టింట్లో దోచేస్తున్నారు.
No comments:
Post a Comment