అంశం: ఛత్రపతి శివాజీ
శీర్శిక: హిందూ మత పరిరక్షకుడు - దేశభక్తుడు
*ఛత్రపతి శివాజీ* గా ఖ్యాతి గడించిన
శివాజీ రాజే భోంస్లే మరాఠా యోధుడు
హిందూ మత పరిరక్షకుడు, దేశం భక్తుడు
యుద్ధ తంత్రాలు నేర్చిన గొప్ప వీరుడు!
షాహాజీ జిజియాబాయిల ముద్దుల తనయుడు
యుద్ధ తంత్రాలను నేర్పించ తండ్రి
నిపుణులను నియమించి బెంగుళూరు వెళ్ళగా
ఇంటివద్ద తల్లి జిజియా బాయి దేశ భక్తిని
మానవత్వాన్ని, మహిళల పట్ల గౌరవాన్ని
న్యాయాన్ని ధర్మాన్ని బోధిస్తూ!
రామాయణం మహాభారతం ఇతిహాసాలను
బలి చక్రవర్తి వీర గాధలను చెబుతూ
పుట్టిన భూమిపై ప్రజలపై ప్రేమ చూపాలని
శత్రువులను దండించాలి అంటూ
వీర లక్షణాలను మొలకింప జేస్తూ
గొప్ప పరాక్రమ వంతుడిగా తీర్చి దిద్దింది!
తండ్రి పరాజయాల నుండి నేర్చిన పాఠాలు
శివాజీ కి ఎంతగానో ఉపయోగ పడ్డాయి
అతి పిన్న వయసులోనే *తోర్నా కోట* ను
స్వాధీనం చేసుకుని విజయం సాధించాడు!
గెరిల్లా యుద్ధాలతో ఇరువది యేడేండ్లు
యుద్దాలు చేసి ఎందరో మొగల్ సామ్రాజ్య
చక్రవర్తుల సంహరించి మూడు వందల
కోటలను స్వాధీనం చేసుకున్నాడు!
హిందూ దేవాలయాలు పరిరక్షించాడు
ప్రజలందరినీ సమానంగా ప్రేమతో చూసాడు
అనేక మసీదులను నిర్మించాడు
స్త్రీల పట్ల అత్యంత గౌరవంగా ఉండేవాడు
చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచి పోయాడు !
No comments:
Post a Comment